iDreamPost

APలో ప్రైవేట్ స్కూల్స్‌కి దూరంగా మిడిల్ క్లాస్! ప్రభుత్వ స్కూల్స్ వైపు అడుగులు! అంతా జగన్ ఎఫెక్ట్!

  • Published May 29, 2024 | 10:53 AMUpdated May 29, 2024 | 10:53 AM

YS Jagan: ఈ ఏడాది ఏపీలో ప్రైవేటు పాఠశాలల్లో చేరే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అందుకు జగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయమే కారణం అంటున్నారు. ఆ వివరాలు..

YS Jagan: ఈ ఏడాది ఏపీలో ప్రైవేటు పాఠశాలల్లో చేరే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. అందుకు జగన్‌ సర్కార్‌ తీసుకున్న నిర్ణయమే కారణం అంటున్నారు. ఆ వివరాలు..

  • Published May 29, 2024 | 10:53 AMUpdated May 29, 2024 | 10:53 AM
APలో ప్రైవేట్ స్కూల్స్‌కి దూరంగా మిడిల్ క్లాస్! ప్రభుత్వ స్కూల్స్ వైపు అడుగులు! అంతా జగన్ ఎఫెక్ట్!

పిల్లలకు మనం ఇచ్చే నిజమైన, విలువైన ఆస్తి ఏదైనా ఉందా అంటే.. అది కేవలం చదువు మాత్రమే. వేల కోట్ల ఆస్తులు కూడబెట్టినా.. సామార్థ్యం లేని వారి చేతికి దాన్ని అప్పగిస్తే.. అనతి కాలంలోనే ఆస్తులు కరిగిపోతాయి. చివరకు అప్పులపాలవ్వాల్సి వస్తుంది. అదే మన బిడ్డలకు నాణ్యమైన విద్య అందిస్తే.. అది వారికి జీవితాంతం ఉపయోగపడుతుంది. చదువు మనిషిలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది. బతుకు మీద భరోసా కల్పిస్తుంది.. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా సరే.. బ్రతకగలిగే ధైర్యాన్ని ఇస్తుంది. ప్రపంచంలోని ఎందరో ప్రముఖులు ఇదే విషయాన్ని చెబుతూ వచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కూడా ఇదే విషయాన్ని బలంగా నమ్ముతారు.

పిల్లలకు ఆస్తులు కూడబెట్టి అందించకపోయినా పర్లేదు.. వారికి మంచి నాణ్యమైన విద్య అందిస్తే.. భవిష్యత్తు గురించి ఎలాంటి భయం ఉండదు అని బలంగా నమ్మిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. కానీ నేటి కాలంలో నాణ్యమైన విద్య అనేది ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. పిల్లలకు మంచి నాణ్యమైన ఇంగ్లీష్‌ మీడియం చదువులు అందాలంటే.. లక్షల్లో ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ధనవంతులైతే పిల్లల చదువు కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. మరి పేదలు, మధ్య తరగతి వారి పరిస్థితి ఏంటి.. వారి పిల్లలకు నాణ్యమైన విద్య వద్దా.. చదువు అందరి హక్కు. అలాంటిది.. డబ్బు కారణంగా పేదలు, మధ్యతరగతి వారు దాన్ని ఎందుకు వదులుకోవాలి అని భావించిన సీఎం జగన్‌.. విద్యా రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చూట్టారు.

ధైర్యం చేసిన జగన్‌..

దీనిలో భాగంగా దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి తీసుకోని నిర్ణయాన్ని తీసుకోవడమే కాక.. ఎంతో విజయవంతంగా దాన్ని అమలు చేస్తున్నారు. అదే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం. ప్రతిపక్షాలు దీనిపై ఎన్ని విమర్శుల చేశాయో.. ఎంత దుష‍్ప్రచారం చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ జగన్‌ మాత్రం ఈ నిర్ణయంలో వెనకడుగు వేయలేదు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్యను అందించాలనే నిర్ణయాన్ని పక్కగా అమలు చేశారు. అంతేకాక నాడు-నేడు కార్యక్రమం ద్వారా.. ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను పూర్తిగా మార్చేశారు. కార్పొరేట్‌ స్కూల్స్‌కు ధీటుగా వాటిని తీర్చిదిద్దారు.

మరి జగన్‌ చేసిన ప్రయత్నాలు ఫలించాయి అంటే.. ప్రపంచవేదికల మీద అదరగొడుతున్న ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులే ఇందుకు సమాధానం. ఇంగ్లీష్‌ మీడియం చదువుల కోసం అప్పుల చేసి మరీ ప్రైవేటు పాఠశాలలకు పంపే తల్లిదండ్రులు.. ఇప్పుడు గవర్నమెంట్‌ స్కూల్స్‌కే తమ ఓటు వేస్తున్నారు. ఈ ఏడాది ప్రైవేటు స్కూల్స్‌లో అడ్మిషన్స్‌ చూస్తే ఈ విషయం మరింత స్పష్టంగా అర్థం అవుతుంది. సాధారణంగా ప్రతి ఏటా.. వేసవి సెలవుల ప్రారంభానికి ముందు నుంచే ప్రైవేటు పాఠశాల్లలో కొత్త ఏడాదికి సంబంధించి అడ్మిషన్స్‌ ప్రక్రియను ప్రారంభిస్తాయి. ఇక ఇంగ్లీష్‌ మీడియం స్కూల్స్‌కి భారీ ఎత్తున అప్లికేషన్లు వస్తుంటాయి.

అయితే ఇది గతం. ఈ ఏడాది ఏపీలో ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్స్‌ తీసుకునే వారి సంఖ్య బాగా తగ్గిందని.. తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి మెరుగు కావడం, మంచి విద్య, భోజనం, ఇంగ్లీష్ మీడియం వంటి సదుపాయాలు పెరగడంతో.. పేదలు, మధ్యతరగతి జనాలు.. ప్రభుత్వ పాఠశాలకే తమ ఓటేస్తున్నారు. దాంతో ఈ ఏడాది ఏపీలో ప్రైవేటు ఇంగ్లీష్‌ మీడియం పాఠశాల్లలో చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ఇక ఇదంతా జగనన్న తీసుకొచ్చిన మార్పే.. ఆయన అమలు చేసిన సంస్కరణల ఫలితమే అంటున్నారు ఏపీ జనాలు. తమ పిల్లలకు మంచి విద్యను అందిస్తోన్న​ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి