iDreamPost

పెళ్లైన 20 ఏళ్ల తర్వాత ఒకేసారి ముగ్గురికి జన్మనిచ్చింది.. కానీ ఇంతలోనే

  • Published Aug 10, 2023 | 1:19 PMUpdated Aug 10, 2023 | 1:19 PM
  • Published Aug 10, 2023 | 1:19 PMUpdated Aug 10, 2023 | 1:19 PM
పెళ్లైన 20 ఏళ్ల తర్వాత ఒకేసారి ముగ్గురికి జన్మనిచ్చింది.. కానీ ఇంతలోనే

అ‍మ్మగా మారిన తర్వాతే.. మహిళ జీవితానికి పరిపూర్ణత లభిస్తుందని అంటారు. అ‍మ్మ అని పిలిపించుకోవాలని.. మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించాలని ప్రతి స్త్రీ కోరుకుటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మహిళ కూడా సంతానం కోసం అలానే ఎదురు చూసింది. ఒక్కటి, రెండడేళ్లు కాదు.. ఏకంగా 20 ఏళ్ల పాటు ఎదరు చూసింది. చివరకు ఆమె ఎదురు చూపులు ఫలించి పెళ్లైన 20 ఏళ్ల తర్వాత గర్భం దాల్చింది. దేవుడి దయ వల్ల ఒకేసారి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. 20 ఏళ్ల కన్నీటికి.. శాశ్వతంగా పరిష్కారం దొరికింది.. అంతులేని సంతోషాలు తమ ఇంటికి వచ్చాయని భావించారు. అయితే వారు ఆనందంగా ఉండటం విధికి నచ్చలేదు. చిన్నారులు భూమ్మీదకు వచ్చిన క్షణాల వ్యవధిలోనే అంతులేని విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..

పెళ్లైన 20 ఏళ్ల తర్వాత ఒకేసారి ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. ఏళ్ల పాటు బిడ్డల కోసం నిరీక్షించిన ఆ తల్లి.. కన్న బిడ్డలను కనీసం చేతితో తాకకుండానే కన్ను మూసింది. ఈ విషాదకర సంఘటన ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం మాగల్లులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన షేక్‌ నజీరాకు.. పల్లగిరికి చెందిన ఖాసింతో 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లైన 20 ఏళ్ల తర్వాత నజీరా గర్భం దాల్చడంతో కుటుంబంలో ఆనందంలో మునిగిపోయింది. పది రోజుల క్రితం ఆమెకు పురిటి నొప్పులు రావడంతో విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ నజీరాకు డాక్టర్లు సిజేరియన్ చేసి ముగ్గురు పిల్లలను బయటకు తీశారు. వీరిలో ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లవాడు ఉన్నారు.

సిజేరియన్ తర్వాత నజీరాకు రక్తం తక్కువగా ఉండటంతో డాక్టర్లు వెంటనే రక్తం ఎక్కించారు. కానీ దురదృష్టం కొద్ది.. బిడ్డలకు జన్మనిచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే నజీరా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. పెళ్లైన తర్వాత సుమారు 20 ఏళ్ల పాటు సంతానం కోసం కలవరించిన నజీరా.. పుట్టిన పిల్లలను కనీసం దగ్గరకు కూడా తీసుకోకముందే మృతి చెందడంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

పాపం పసికందులు.. పుట్టగానే తల్లిని కోల్పోయారు.. ఇక వారి ఆలనా పాలనా ఎవరు చూస్తారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బంధువులు, కుటుంబ సభ్యులు. ఇక బుధవారం నజీరా మృతదేహాన్ని పల్లగిరికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆటో డ్రైవర్‌‌గా ఉన్న ఖాసిం భార్య ప్రాణాలు ఎలాగైనా కాపాడుకోవాలని చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఇటు భార్య చనిపోగా.. మరోవైపు పసిపిల్లలకు ప్రైవేటు ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి