iDreamPost

బంగారు దుకాణాలపై దాడులు.. 300 కేజీల గోల్డ్‌ సీజ్‌

  • Published Oct 23, 2023 | 3:36 PMUpdated Oct 23, 2023 | 3:58 PM

ఎన్నికల నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇక ఎన్నికల కోడ్‌ అమ్మల్లోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణలో 132 కోట్ల రూపాయల విలువైన సొత్తుని సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా 300 కిలోల బంగారాన్ని సీజ్‌ చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాలు. .

ఎన్నికల నేపథ్యంలో.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ముమ్మరంగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇక ఎన్నికల కోడ్‌ అమ్మల్లోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణలో 132 కోట్ల రూపాయల విలువైన సొత్తుని సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా 300 కిలోల బంగారాన్ని సీజ్‌ చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాలు. .

  • Published Oct 23, 2023 | 3:36 PMUpdated Oct 23, 2023 | 3:58 PM
బంగారు దుకాణాలపై దాడులు.. 300 కేజీల గోల్డ్‌ సీజ్‌

ఎన్నికల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక అనేక ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు చేస్తున్నారు. ఆధారాలు లేకుండా తరలిస్తోన్న నగదు, బంగారంతో పాటు.. లెక్కలు చూపని సొత్తును కూడా సీజ్‌ చేస్తున్నారు. త్వరలోనే ఎన్నికలు జరగబోయే తెలంగాణతో పాటు.. ఏపీలోని పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా ఐటీ సోదాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రతి రోజు ఐటీ అధికారులు ఎక్కడో ఒక చోట దాడులు చేస్తూ.. భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒకేసారి 300 కిలోల బంగారాన్ని సీజ్‌ చేయడం సంచలనంగా మారింది. ఆ వివరాలు..

ఆంధ్రప్రదేశ్‌ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో గత నాలుగు రోజులుగా ముమ్మరంగా ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. బంగారం షాపులే టార్గెట్‌గా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే సుమారు 300 కేజీల బంగారాన్ని సీజ్‌ చేశారు అధికారులు. బంగారం బిజినెస్‌కు ప్రొద్దుటూరు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పండుగల సీజన్‌ కావడం, త్వరలోనే పెళ్లిళ్ల సీజన్‌ దగ్గర పడుతుండటంతో.. బంగారానికి భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఈ క్రమంలో బంగారు దుకాణాదారులు భారీ మొత్తంలో గోల్డ్‌ కొనుగోలు చేసి పెట్టుకున్నారు.

ఈ తరుణంలో ఐటీ అధికారులు ప్రొద్దుటూరులోని బంగారం దుకాణాల్లో గత నాలుగు రోజుల నుంచి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఆదివారంతో ఈ తనిఖీలు ముగియగా.. ఏకంగా 300 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారానికి సంబంధించి సరైన బిల్లులు లేకపోవడంతో సీజ్ చేశారు అధికారులు. నాలుగు షాపుల నుంచి ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు

వివిధ ప్రాంతాలనుంచి ప్రొద్దుటూరుకి అక్రమంగా భారీ ఎత్తున బంగారం దిగుమతి అవుతుందనే సమాచారం తెలియడంతో.. విజయవాడ, తిరుపతికి చెందిన ఐటీ అధికారులు.. ఇక్కడ సోదాలు నిర్వహించారు. గత నాలుగు రోజులుగా దాదాపు వెయ్యి షాపుల్లో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బుశెట్టి జువెలరస్ డైమండ్స్, గురురాఘవేంద్ర, తల్లం షాపుల్లో డాక్యుమెంట్స్ లేని 300 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. సీజ్ చేసిన బంగారాన్ని తిరుపతికి తరలించారు.

ఇండియాలో ముంబై తర్వాత అతిపెద్ద గోల్డ్ మార్కెట్‌గా ప్రొద్దుటూరుకు పేరుంది. ఈ టౌన్‌లో ఏకంగా రెండు వేలకుపైగా బంగారం దుకాణాలు ఉన్నాయి. దేశంలోని వేర్వురు ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వచ్చి బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. కొన్ని షాపుల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయనే సమాచారంతో మిగతా దుకాణాల యజమానులు కూడా భయపడి షాపులను మూసివేశారు. దాంతో గత నాలుగు రోజులుగా ప్రొద్దుటూరులో బంగారం షాపులన్నీ బంద్ అయ్యాయి.

ఈ కారణంతో బంగారం కొనుగోలు చేయడానికి వచ్చిన కస్టమర్లు నిరాశతో వెనుదిరిగారు. ఇప్పుడు పండుగ సీజన్ కావడంతో మంచి గిరాకీ ఉందని, కానీ ఐటీ అధికారుల భయంతో మూసివేసినట్లు గోల్డ్ షాపుల నిర్వాహకులు చెబుతున్నారు. నాలుగు రోజుల పాటు మూసివేయడంతో లక్షల్లో నష్టం జరుగుతుందని గోల్డ్ షాప్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తోన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి