iDreamPost

మత్స్యకారులను స్వస్థలాలకు చేరుస్తున్న జగన్ సర్కార్

మత్స్యకారులను  స్వస్థలాలకు చేరుస్తున్న జగన్ సర్కార్

కరోనా నేపధ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల.. ఉపాధి నిలిచిపోయి దిక్కుతోచని స్థితిలో గుజరాత్ లో చిక్కుకున్న ఉత్తరాంధ్ర మత్స్యకారులకు ఊరట లభించింది. వైయస్ జగన్ సర్కార్ చొరవతో వారందరూ స్వస్థలాలకు బయలుదేరారు. ఉత్తరాంధ్ర నుంచి గుజరాత్ లో చేపల వేట పని మీసం భారీ సంఖ్యలో వెళ్తారు. అక్కడ కంపెనీల్లో పని చేసి కుటుంబాలను పోషించుకుంటారు. అయితే లాక్ డౌన్ వల్ల వేట నిలిచిపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

ఈ నేపథ్యంలో వారి కష్టాలను తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి స్వస్థలాలకు పంపాలని గుజరాత్ విజయ్ రూపానికి లేఖ రాశారు. అందుకోసం అయ్యే ఖర్చును తామే భరిస్తామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవడంతో గుజరాత్ లో చిక్కుకున్న ఏపీ మత్స్యకారులకు మోక్షం కలిగింది. దాదాపు4,350 మంది 64 బస్సులలో నిన్న మంగళవారం ఏపీకి బయలుదేరారు.

మార్గమధ్యలో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రతి బస్సుకు ఒక అధికారిని నియమించారు.మత్స్యకారుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అదేవిధంగా మూడు కోట్ల రూపాయలను కేటాయించింది. వారందరికీ కరోనా పరీక్షలు జరిపి పంపుతున్నారు. నెల రోజులకు పైగా అష్ట కష్టాలు పడ్డ మత్స్యకారులు ఎట్టకేలకు వారి స్వస్థలాలకు చేరుకుంటూ ఉండడంతో వారి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి