iDreamPost

లాక్ డౌన్ – ఏజన్సీ ని ఆదుకుంటున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.

లాక్ డౌన్ – ఏజన్సీ ని ఆదుకుంటున్న డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.

ఎప్పుడొచ్చామన్నది కాదు, ఎంత చేశామన్నది ముఖ్యం. ఎక్కడైనా అంతే… ఎప్పుడొచ్చామన్నది కాదు..జనాలమీద, ప్రజలమీద ఎంత ప్రభావం చూపామన్నదే ముఖ్యం. కొందరు ఓపెనింగ్ బ్యాట్సమెన్ గా బరిలో దిగుతారు మూడురోజులు క్రీజ్ లో ఉండి, బాల్స్, టైమ్ తినేసి ముప్పై పరుగులు చేస్తారు..మరికొందరు ఫోర్త్ డౌన్లో దిగి అరపూట మాత్రమే ఆడి ఓ ఎనభయ్ పరుగులు చేస్తారు..సరిగ్గా ఇలాంటివాళ్లే అభిమానుల మనసుల్లో మిగిలిపోతారు…నాయకుల్లోనూ అంతే, కొందరు ఏళ్లతరబడి పాలిటిక్స్ చేస్తారు,ఎందుకు ఉన్నారో ఏమి చేస్తున్నారో ఎవరికీ తెలీదు..మరికొందరు మాత్రం అప్పుడే ఫ్రెష్ గా పాలిటిక్స్ లోకి వచ్చి మెరుపు వేగంతో తమ ప్లాన్స్ అమలుచేసి పదిమందిలోనూ నిలిచిపోయారు..సరిగ్గా ఆ మరికొందరి కోవలోకి వచ్చేవారిలో డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఒకరు.

మంత్రిగా చేస్తున్నది మొదటిసారే అయినా జనంలోకి వెళ్లడం, పదిమందినీ కలవడంలో ఆమెను మించినవాళ్ళు లేరనే చెప్పాలి..వాస్తవానికి జిల్లాకేంద్రానికి దూరంగా ఉన్న నియోజగవర్గాల నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులకు పాలన మీద అంతగా పట్టుండదు,అధికారుల మీద కమాండ్ ఉండదు అంటారు గానీ ఆ అభిప్రాయం శ్రీవాణి విషయంలో మాత్రం తప్పు అని చెప్పవచ్చు. కరోనా నేపథ్యంలో నాయకులందరూ ఇళ్లలో కూర్చుని ఉచిత సలహాలు చెబుతున్న తరుణంలో శ్రీవాణి మాత్రం జిల్లా మొత్తాన్ని చుట్టేస్తూ జనాన్ని జాగృతం చేస్తున్నారు. ఇంకా జిల్లా కేంద్రంలో సొంత డబ్బులతో కొన్ని కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు..ఇంకా తన కురుపాం నియోజకవర్గం పరిధిలోని పోలీసులు మొత్తానికి కొంత సామగ్రిని అందించారు.

అవి కాకుండా ముఖ్యమంత్రితో రివ్యూలు, జిల్లా కేంద్రంలో అధికారులతో రివ్యూలు ఇంకా వేరే జిల్లాల్లో చిక్కుకున్న విజయనగరం జిల్లా కూలీీలను వెనక్కి రప్పించడం, కరోనా అనుమానితుల కోసం ఏర్పాటు చేసిన క్వారంటేయిన్ సెంటర్ల పరిశీలన, నోడల్ ఆస్పత్రికి వచ్చి అక్కఫై ఏర్పాట్లు చూస్తూనే మధ్యలో కార్యకర్తలు, ముఖ్యంగా గ్రామాల నుంచి ఎవరు ఫోన్ చేసినా నేరుగా రిసీవ్ చేసుకుని ‘భయపడకర్రా నేనున్నాను కదా’ అంటూ భరోసా ఇస్తుండడం జిల్లా ప్రజలను ఆకట్టుకుంది.. ఆమె మంత్రి కావచ్చు కానీ మిగతా ఎమ్మెల్యేలు, కూడా తమతమ నియోజకవర్గాల్లో అభాగ్యులకు ఎంతో కొంత సాయం చేయొచ్చు కానీ అలాంటి దాఖలాలు పెద్దగా లేవు.ఏదో ఇచ్ఛికానికి ఏదో ఒక పూట పులిహోరా పంచడం తప్ప మిగతా వాళ్ళు పెద్దగా చేసిందేమీ లేదు..కానీ శ్రీవాణి మాత్రం జనంలోకి వెళ్లడం, వారి సమస్యలు విని పరిష్కరించడంలో మాత్రం అందరికీ అందనంత ముందంజలో ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి