iDreamPost

‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు నిర్వహించడానికి కారణం అదే: CM జగన్

YS Jagan, Aadudam Andhra: నేడు ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలు వైజాగ్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ క్రీడల్లో గెలిచిన వారికి కప్ , నగదు అందజేశారు.

YS Jagan, Aadudam Andhra: నేడు ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకలు వైజాగ్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ క్రీడల్లో గెలిచిన వారికి కప్ , నగదు అందజేశారు.

‘ఆడుదాం ఆంధ్రా’ పోటీలు నిర్వహించడానికి కారణం అదే: CM జగన్

గ్రామీణ యువతలోని క్రీడానైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రోగ్రామ్ ‘ఆడుదాం ఆంధ్రా’. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది యువతలోని క్రీడానైపుణ్యం వెలుగులోకి వచ్చింది. నాలుగు దశల్లో నిర్వహించిన ఈ పోటీల్లో గెలిచిన వారికి.. తుది సమరం విశాఖలో జరిగింది. ఫిబ్రవరి 9 నుంచి 13వ తేదీ వరకు వైజాగ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ లు జరిగాయి. నేడు ముగింపు వేడుకలు వైఎస్సార్ స్టేడియంలో అట్టహాసంగా జరిగాయి. ఈ ముగింపు వేడుకలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన పిల్లలను సానబెడితే.. ప్రపంచానికి వెలుగులు అవుతారన్నారు.

ఏపీ ప్రభుత్వం చేపట్టిన మహా క్రీడా సంగ్రామం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం నేటితో ముగిసింది. వైజాగ్ లోని వైఎస్సార్ స్టేడియంలో ఈ ముగింపు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. వివిధ కళాకారులు నృత్యాలతో ఆకట్టుకున్నారు. అలానే ఇక్కడ ప్రదర్శించిన లైటింగ్ షో అందరిని ఆకట్టుకుంది. అలానే ఆడుదాం ఆంధ్రా  కోసం రూపొందించిన ప్రత్యేక గీతాన్ని అక్కడ ప్లే చేశారు. ఇలానే వివిధ క్రీడల్లో విజేతలు గా నిలిచిన వారికి సీఎం జగన్ బహుమతులు, నగదును అందజేశారు.

ఇక ఈ వేడుకలో సీఎం జగన్ మాట్లాడుతూ…ఆరోగ్యం పట్ల, వ్యాయామానికి ఉన్న అవసరం పట్ల ప్రజలకు అవగాహన పెరగటం చాలా అవసరమన్నది ఈ పోటీల మొదటి ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా గ్రామ స్థాయి నుంచి మన మట్టిలోని మాణిక్యాలను గుర్తించాలని తెలిపారు. అలా గుర్తించి.. వారికి మనం​ సానబెట్టి సరైన శిక్షణ ఇవ్వగలితే మట్టిలో ఉన్న మాణిక్యాలను ప్రపంచానికి వెలుగు అవుతారని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలుగా పరిచయం చేయగలుగుతామన్నది రెండో ఉద్దేశమని సీఎం జగన్ స్పష్టం చేశారు.

ఈ రెండు ఉద్దేశాల్లో భాగంగానే క్రికెట్‌, వాలీబాల్‌, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ ఇటువంటి ఐదు రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామస్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేశామని సీఎం తెలిపారు. ఆడుదాం ఆంధ్రాలో భాగంగా దాదాపుగా 25 లక్షల 40 వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారని తెలిపారు. దాదాపు 47 రోజులపాటు జరిగిన ఈ క్రీడా సంగ్రామంలో ఏకంగా 3.30 లక్షల పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయని సీఎం జగన్ చెప్పారు.

ఇక ఇందులో భాగంగా 1.24 లక్షల పోటీలు మండల స్థాయిలో, 7,346పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగాయని పేర్కొన్నారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో 1731 పోటీలు, రాష్ట్ర స్థాయిలో260 పోటీలు నిర్వహించామని తెలిపారు. తాజాగా నేటి ఫైనల్స్‌తో ఈ క్రీడా సంగ్రామాన్ని ముగించుకున్నామని సీఎం జగన్‌ తెలిపారు. విశాఖలోని ఉత్తరాంధ్ర మన కోడి రామమూర్తిగారి గడ్డమీద ఈ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని సీఎం జగన్‌ అన్నారు. దాదాపు 37 కోట్ల రూపాయల ఆటల కిట్లు గ్రామ స్థాయి నుంచి పోటీ పడుతున్న పిల్లలందరికీ ఇచ్చామని తెలిపారు. అలానే 12.21 కోట్ల రూపాయల బహుమతులు ఈరోజు పోటీలో పాలుపంచుకుని విజేతలు గా నిలచిన వారికి ఇవ్వడం జరిగిందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో చెన్నై సూపర్ కింగ్స్, ఏసీఏ తో పాటు మిగతా ఆటలకు సంబంధించిన ప్రో కబడ్డీ, బ్లాక్ హాక్స్, వాలీబాల్, ఏపీ ఖోఖో అసోసియేషన్, ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారంతా పాల్గొంటూ ప్రతిభ కలిగిన 14 మందిని వాళ్లు దత్తత తీసుకొని మరింత శిక్షణ ఇచ్చే దిశగా అడుగులు పడుతున్నాయని తెలిపారు. మన పిల్లలకు ఇంకా సరైన ట్రైనింగ్ ఇవ్వగలిగితే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే పరిస్థితి ఉంటుందని తెలిపారు. మరి.. ఆడుదాం ఆంధ్రా ముగింపు వేడుకల్లో సీఎం జగన్ చేసిన ప్రసంగంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి