iDreamPost

బాలకృష్ణకు స్పీకర్‌ వార్నింగ్‌.. మరోసారి ఇలాంటివి చేస్తే చర్యలు తప్పవు..!

బాలకృష్ణకు స్పీకర్‌ వార్నింగ్‌.. మరోసారి ఇలాంటివి చేస్తే చర్యలు తప్పవు..!

గురువారం ఉదయం ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఐదు రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో తొలిరోజే.. చంద్రబాబు అరెస్టుపై టీడీపీ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. సభను అడ్డుకోవడమే కాకుండా స్పీకర్ పోడియం ఎదుట ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రవర్తించిన తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో వైసీపీ ఎమ్మెల్యే వైపు చూస్తూ బాలకృష్ణ మీసం తిప్పాడు. అతడి ధీటుగా మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇరు సభ్యుల ఆందోళనతో సభలో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సభలో ఇలా ప్రవర్తించడం మంచి కాదంటూ.. మొదటి తప్పుగా క్షమించి వదిలేస్తున్నట్లు స్పీకర్ హెచ్చరించారు.

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వైసీపీ ఎమ్మెల్యేలను చూస్తూ , మీసం తిప్పి, తొడ కొట్టారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అని… ఈ అంశంపై  దైనికైనా రెడీ అన్నట్లు వైసీపీ నేతలకు బాలకృష్ణ సవాల్ చేశారు. బాలకృష్ణకు ధీటుగా శ్రీకాళహస్తీ ఎమ్మెల్యే తొడ కొట్టిమరీ హెచ్చరించారు. ఇలా బాలయ్య తీరుతో టీడీపీ , వైసీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. చివరకు సభలో గందరగోళం నెలకొంది. అయితే స్పీకర్ తమ్మినేని ఎంత వారించిన టీడీపీ సభ్యులు వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీని కాసేపటి వరకు వాయిదా వేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైన సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం.. బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చారు. మీసాలు మెలేయడం వంటి వికృత చేష్టాలు చేయడం వంటివి తప్పని స్పీకర్ హెచ్చరించారు.

సభ స్థానానికి వచ్చి.. మీసాలు మేలివేయడం వంటి చర్యలు చేపట్టిన నందమూరి బాలకృష్ణ గారు సభ సంప్రదాయాలకు ఉల్లంఘించారు. ఇది ఆయన మొదటి తప్పిందంగా భావించి.. సభ ఆయనకు మొదటి హెచ్చరికను ఇస్తోంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సింది ఆయనను ఈ సభ హెచ్చరిస్తోందని స్పీకర్ తెలిపారు. అంతేకాక  సమావేశాలు పూర్తయ్యే వరకూ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని, అనగాని సత్యప్రసాద్ , పయ్యావుల కేశవ్ ను స్పీకర్ సస్పెండ్ చేశారు. మిగిలిన టీడీపీ సభ్యులందరిని ఒక్కరోజు సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులతో పాటు  ఉండవల్లి శ్రీదేవిని కూడా స్పీకర్ సస్పెండ్ చేశారు. మరి.. బాలకృష్ణకు అసెంబ్లీ స్పీకర్ వార్నింగ్ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి