iDreamPost

AP Govt: ఆ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

నేటికాలంలో ఇచ్చిన మాటను, హామీని నిలబెట్టుకునే నేతలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలా మాట ఇస్తే నిలబెట్టుకునే నేతల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకరు. తాజాగా ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుని మరోసారి మాట నిలబెట్టుకున్నారు.

నేటికాలంలో ఇచ్చిన మాటను, హామీని నిలబెట్టుకునే నేతలు చాలా తక్కువ మందే ఉన్నారు. అలా మాట ఇస్తే నిలబెట్టుకునే నేతల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒకరు. తాజాగా ఉద్యోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుని మరోసారి మాట నిలబెట్టుకున్నారు.

AP Govt: ఆ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త!

ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కార్ చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది. సీఎం జగన్ అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలను అందిస్తూ.. వారి మదిలో మంచి గుర్తింపు పొందారు. విద్యార్థులు, రైతులు, మహిళలకు వివిధ పథకాల ద్వారా ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అలానే ప్రభుత్వ, కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కూడా జగన్ సర్కార్ శుభవార్తలు చెప్పింది. తాజాగా కాంట్రాక్ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం ఓ తీపి కబురు చెప్పింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రభుత్వ పరిపాలన విధుల్లో కాండ్రాక్ట్ ఉద్యోగులది కీలక పాత్ర. వారి ఉద్యోగాల విషయంలో ప్రభుత్వాలు వివిధ ఆ హామీలు ఇస్తుంటాయి. అలానే ప్రభుత్వాలు కూడా పలు సందర్భాల్లో వారికి గుడ్ న్యూస్ లు చెబుతుంటాయి. తాజాగా ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులు జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. అంతేకాక ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు అనే  విషయాన్ని సీఎం జగన్ మరోసారి రుజువురు చేశారు. విశ్వసనీయత, విలువలకు, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో జగన్ మోహన్ రెడ్డికి తండ్రికి తగ్గ తనయుడుని చాలా మంది అంటూరు. అలానే ఆయన కూడా తన పరిపాలన విషయంలో కూడా ఇచ్చిన వాగ్దానలను అమలు చేశారు. తాజాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో కూడా తాను ఇచ్చిన మాటలను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో అర్హులైన కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వైద్య ఆరోగ్య శాఖలో 2014 ఏప్రిల్ 1 నాటికి కాంట్రాక్ట్ ఉద్యోగులగా పనిచేస్తూ అర్హులైన 2,146 మందిని క్రమబద్దీకరిస్తూ వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు జీవో జారీ చేశారు. ప్రజా ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ విభాగంలో పని చేస్తున్న 2025 మంది వైద్య సిబ్బంది, డీఎంఈ పరిధిలోని 62, కుంటుంబ సంక్షేమ శాఖలో 55 మంది, ఆయుష్, యునానీ విభాగాలలో 4 ఉద్యోగాలను ఏపీ ప్రభుత్వం క్రమబద్దీకరణ చేశారు. పాదయాత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ క్రమబద్దీకరణ  చేసిన జగన్ ప్రభుత్వం పట్ల కాంట్రాక్ట్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి..కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి