iDreamPost

ప్రశాంత్ ఫ్యాన్స్‌కి అమర్ దీప్ రిక్వెస్ట్.. ఇంత మంచోడివి ఏంటి భయ్యా..

బిగ్ బాస్ అనేది ఓ గేమ్. ఆట ఆటలా చూడాలి కానీ.. సీరియస్‌గా తీసుకున్నారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. ఈ షోలో ప్రశాంత్, సీరియల్ నటుడు అమర్ దీప్ మధ్య గట్టి పోటీ ఉండేది. ఆటలో భాగంగా నామినేషన్ల విషయానికి వస్తే ఒకరికి ఒకరు నామినేట్ చేసుకునేవారు. కానీ బయట చూస్తున్న ప్రేక్షకులు.. దీన్ని మరోలా తీసుకుని.. అమర్ దీప్ పై కోపం పెంచుకున్నారు.

బిగ్ బాస్ అనేది ఓ గేమ్. ఆట ఆటలా చూడాలి కానీ.. సీరియస్‌గా తీసుకున్నారు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్. ఈ షోలో ప్రశాంత్, సీరియల్ నటుడు అమర్ దీప్ మధ్య గట్టి పోటీ ఉండేది. ఆటలో భాగంగా నామినేషన్ల విషయానికి వస్తే ఒకరికి ఒకరు నామినేట్ చేసుకునేవారు. కానీ బయట చూస్తున్న ప్రేక్షకులు.. దీన్ని మరోలా తీసుకుని.. అమర్ దీప్ పై కోపం పెంచుకున్నారు.

ప్రశాంత్ ఫ్యాన్స్‌కి అమర్ దీప్ రిక్వెస్ట్.. ఇంత మంచోడివి ఏంటి భయ్యా..

105 రోజుల పాటు, 19 మంది కంటెస్టెంట్లతో సాగిపోయిన బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల ముగిసింది. ఈ సీజన్‌కు వచ్చిన కంటెస్టెంట్లలో ఎవర్నీ తక్కువ చేయడానికి వీల్లేదు. ఎవరికీ వారే స్టామినాను చూపించారు. సత్తా చాటారు. అయితే కప్ ఒకర్నే వరిస్తుంది కనుక.. విజేతగా కామన్ మ్యాన్, రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు. అయితే ఆ తర్వాత అసలు రచ్చ మొదలైంది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అన్న ముసుగులో అల్లరి మూకలు.. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడమే కాకుండా సెలబ్రిటీ కార్ల అద్దాలను పగులకొట్టారు. అలాగే ఈ షో రన్నరప్ అమర్ దీప్ భార్య, తల్లి వస్తున్న కారుపై విచక్షణా రహితంగా దాడి చేసి వారిని భయభ్రాంతులకు గురి చేశారు. హౌస్‌లో విన్నర్ ప్రశాంత్‌కు ప్రతి విషయంలో గట్టి పోటీనిచ్చాడుఅమర్ దీప్. దీంతో అతడిపై కోపం పెంచుకున్నారు ప్రశాంత్ ఫ్యాన్స్.

స్టూడియో బయటే..అమర్ దీప్ భార్య తేజస్విని, తల్లి రూపా కారులో వస్తుండగా.. ఆ వాహనాన్ని అడ్డుకోవడమే కాకుండా.. వెనుక నుండి రాళ్లు విసిరి కారు అద్దం ధ్వంసం చేశారు. దీంతో భయపడిపోయారు ఆ ఇద్దరు మహిళలు. వారిని బూతులు కూడా తిట్టారు. ఈ వీడియో నెట్టింట్లో కూడా వైరల్ అయ్యింది. ఈ దాడి ఘటనపై సిటిజన్లు కూడా ప్రశాంత్ ఫ్యాన్స్ పై మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై తాజాగా అమర్ దీప్ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి ఓ విన్నపం కూడా  చేశాడు.  ‘నాకు మద్దతు తెలిపిన తెలుగు రాష్ట్రాల ప్రజలకు పాదాభివందనాలు. నన్ను ఇక్కడ వరకు తీసుకువచ్చారు. మీ ఇంట్లో ఒకడిగా చూశారు. గెలవలేని వాడ్ని.. గెలుపు దాకా తీసుకువచ్చి గెలిచాడు. బాధాకరమైన విషయం ఏంటంటే.. కారు అద్దాలు పగులగొట్టారు. బయటకు రా నీ అంతు చూస్తా అని అన్నారు. నేను ఒక్కడినే అయితే మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నేనెవరికి భయపడను’ అని పేర్కొన్నాడు అమర్.

‘కానీ మన ఇంట్లో గొడవ జరుగుతుంటే.. అమ్మ, అక్క, చెల్లి, భార్య ఉంటారు. వాళ్లు మన పక్కన ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అని కొంచెం ఆలోచించాలి. అద్దం పగులకొట్టారు ఆ అద్దం పెంకులు వచ్చి అమ్మ, తేజ మీద పడ్డాయి. ఏమీ ఎ వ్వరికీ కాలేదు కాబట్టి సరిపోయింది. విసిరిన రాళ్ల వల్ల తల పగిలి ఎవరికైనా ఏదైనా జరిగి ఉంటే ఈ రోజు నేను ఎవర్నీ కోల్పోయి ఉండేవాడినో నాకే తెలియదు. ఇలాంటివి జరగకూడదు.. ఇలా చేయకండి. మీకు కోపం ఉంటే తిట్టండి. పడతాను, కామెంట్లు పెట్టండి చూస్తాను. ఇంకా కోపం ఉంటే వీడియోలు చేయండి. చేశారు.. నా కుటుంబాన్ని మొత్తం బాధపట్టారు. ఇవేమీ పట్టించుకోను. నేను నమ్ముకున్న నా హీరో రవితేజ.. నాకు అవకాశం వచ్చినప్పుడే నేను గెలిచాను. కానీ ఆ ఆనందంలో వస్తుంటే.. నా కుటుంబాన్ని రోడ్డు మీద నిల్చొబెట్టారు. పర్వాలేదు. నన్ను ప్రేమించే వాళ్లు, దేవుడు చల్లగా చూడబట్టి.. నా భార్యకు,అమ్మకు ఏంకాలేదు. ఇంట్లో ఆడవాళ్లు పక్కన ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉంటే మచింది. డబ్బు, కప్ పోతే తెచ్చుకోవచ్చు, కానీ మనిషి పోతే తెచ్చుకోలేం’అని ప్రశాంత్ ఫ్యాన్స్ ను ఉద్దేశించి హితవు పలికారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి