iDreamPost

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!

తెలంగాణలో గత వారం రోజుల నుంచి వరుసగా వర్షాలు పడుతున్నాయి. ఒకటీ రెండు రోజులు కాస్త ఉదయం పూట తెరపించినా.. రాత్రి సమయంలో భారీగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. కొన్నిచోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు వచ్చి చేరడంతో బస్తీ వాసులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా తెలంగాణ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

గత వారం రోజులుగా తెలంగాణలో వరుస వర్షాలు ముంచేస్తున్నాయి. తాజాగా రాష్ట్రానికి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 12,13 తేదీల్లో కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, మహబూబాబాద్, సూర్యపేట, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, మంచిర్యాల, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అలర్ట్ జారీ చేసింది.

ఇదిలా ఉంటే శనివారం రాత్రి నుంచి హైదరాబాద్ లో పలు చోట్ల వర్షం నాన్ స్టాప్ గా పడుతూనే ఉంది. యూసఫ్ గుడ, బోరబండ, మోతీనగర్, కుకట్ పల్లి, పంజాగుట్ట, బంజారాహిల్స్, గచ్చిబౌలి, మాదాపూర్, కేపీహెచ్బీ, హైటెక్ సిటీ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్లు భారీగా వర్షాలు పడటంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి, రోడ్లపైకి భారీగా నీరు చేరడంతో తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం మార్కెట్ నడిపే చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రాత్రి కూడా పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి