iDreamPost

తిరుమల భక్తులకు అలర్ట్.. మార్చిలో 5 రోజులు ఆర్జిత సేవలు రద్దు!

Alert For Tirumala Devotees: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలను వెల్లడించింది. మార్చి నెలలో మొత్తం 5 రోజులు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

Alert For Tirumala Devotees: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయాలను వెల్లడించింది. మార్చి నెలలో మొత్తం 5 రోజులు ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.

తిరుమల భక్తులకు అలర్ట్.. మార్చిలో 5 రోజులు ఆర్జిత సేవలు రద్దు!

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ జారీ చేసింది. మార్చి నెలలో మొత్తం 5 రోజులపాటు శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి నెలలో 20వ తారీఖు నుంచి 24వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ తెప్పోత్సవాల నేపథ్యంలో ఆ ఐదు రోజులు శ్రీవారి ఆర్జిత సేవలను రద్దు చేశారు. ఈ సాలకట్ల తెప్పోత్సాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఘనంగా నిర్వహించనుంది. ఈ ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఏరోజు ఏ కార్యక్రమం ఉంటుందో కూడా వెల్లడించారు.

తిరుమలకు ఒక్క భారతదేశం నుంచే కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వామివారి భక్తులు దర్శనార్థం వస్తూ ఉంటారు. తిరుమలలో ఒక్క స్వామివారి దర్శనం మాత్రమే కాకుండా.. చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఆ సేవలు, ఉత్సవాల నేపథ్యంలో స్వామివారికి కొన్ని ఆర్జిత సేవలను రద్దు చేస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఈ ఏడాది మార్చినెలలో నిర్వహించబోతున్న సాలకట్ల తెప్పోత్సవాల నేపథ్యంలో మార్చి నెలలో మొత్తం 5 రోజులు టీటీడీ ఆర్జిత సేవలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలను భక్తులకు వెల్లడించింది. ఈ సాలకట్ల తెప్పోత్సవాలకు సంబంధించి తొలిరోజు అనగా.. మార్చి 20న రాత్రి 7 గంటల నుంచి 8 గంటల మధ్య సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి పుష్కరిణిలో దీపాలంకరణల మధ్య తెప్పలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మొత్తం మూడు చుట్లు తిరిగి స్వామి అమ్మవార్లు దర్శనమిస్తారు.

అలాగే మార్చి 21 రెండో రోజు శ్రీకృష్ణ స్వామి రుక్మిణీ సమేతంగా తెప్పలపై విహరిస్తారు. ఇంక మూడోరోజు మలయప్ప స్వామివారు పుష్కరిణిలో మూడుసార్లు విహరించి కరుణిస్తారు. ఇంక నాలుగోరోజు అయితే మలయప్పస్వామి ఐదుసార్లు పుష్కరణిలో విహరిస్తారు. ఇక సాలకట్ల తెప్పోత్సవాల్లో చివరిరోజు శ్రీమలయప్పస్వామి వారు పుష్కరిణిలో ఐదుసార్లు విహరిస్తారు. ఈ తెప్పోత్సవాల నేపథ్యంలోనే టీటీడీ స్వామివారి సేవలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 20, 21 తేదీల్లో సహస్రదీపాలంకార సేవను రద్దు చేశారు. అలాగే మార్చి 22, 23, 24 తేదీల్లో సహస్రదీపాలంకార సేవ మాత్రమే కాకుండా.. ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మార్చి నెలలో ఎవరైతే తిరుమల స్వామివారిని దర్శించుకోవడాని వెళ్లనున్నారో వారు ఈ తేదీలను ఒకసారి పరిశీలిస్తే మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి