iDreamPost

కేంద్రం కీలక నిర్ణయం.. జాతీయ భద్రతా సలహాదారుగా మూడోసారి కూడా అజిత్ దోవల్!

Ajit Doval: అజిత్ దోవల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చాయి.. ఆయనను తొలిసారి జాతీయ భద్రత సలహాదారునిగా నియమించారు. తాజాగా మరోసారి ఆయనను అదే పదవిలో కేంద్రం నియమించింది.

Ajit Doval: అజిత్ దోవల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చాయి.. ఆయనను తొలిసారి జాతీయ భద్రత సలహాదారునిగా నియమించారు. తాజాగా మరోసారి ఆయనను అదే పదవిలో కేంద్రం నియమించింది.

కేంద్రం కీలక నిర్ణయం.. జాతీయ భద్రతా సలహాదారుగా మూడోసారి కూడా అజిత్ దోవల్!

ఇటీవలే దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి మరోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. మొత్తంగా ముచ్చటగా మూడోసారి ఎన్డీయే కూటమి కేంద్రంలో అధికారం చేపట్టింది. ఇక తొలిసారి 2014 మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి నేటి వరకు ఎన్డీయే ప్రభుత్వం కీలక, సంచలన నిర్ణయాలు తీసుకుంది. అలానే ముఖ్యంగా దేశ భద్రత విషయంలో బీజేపీ ప్రభుత్వం ఎక్కడ రాజీపడటంలేదు. ఈక్రమంలోనే మరోసారి అధికారంలోకి వచ్చిన తరువాత దేశ భద్రత అంశానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా అజిత్ దోవల్‌ను తిరిగి నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆయనను ఈ పదవిలో వరుసగా మూడోసారి కేంద్రం నియమించింది.

అజిత్ దోవల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2014లో బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో వచ్చాయి.. ఆయనను తొలిసారి జాతీయ భద్రత సలహాదారునిగా నియమించారు. ఈ క్రమంలో ఆయన ఆధ్వర్యంలో సర్జికల్ స్ట్రైక్ వంటి ఆపరేషన్లు చేపట్టారు. అంతేకాక జమ్ముకాశ్మీర్ లో శాంతి భద్రతలను పెంచడంలో అజిత్ దోవల్ కీలక పోషించారు. ఆయనకు ఉగ్రవాద నిరోధక నిపుణుడిగా పేరుపొందారు. ఎప్పుడూ ప్రధానికి వ్యూహాత్్మక ఆలోచనలు, కార్యాచరణ ప్లాన్ పై అజిత్ దోవల్ సూచనలు ఇస్తుంటారు.

పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో రహస్య గూఢఛారిగా  పని చేసిన ఆయనకు ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరు ఉంది. 2017లో డోక్లామ్ పీఠభూమిలో , 2020లో తూర్పు లడఖ్ లో చైనా ఆర్మీ దురాక్రమణను ఎదుర్కొవడంలో అజిత్ దోవల్ అత్యంత కీలక పాత్ర పోషించారు. అలానే దేశ భద్రత విషయంలో తనదైన వ్యూహాలతో ప్రధాని వద్ద మంచి మార్కులు పొందారు. ఇప్పటికే రెండుసార్లు ఎన్ఎస్ఏ గా ఉన్న ఆయన పదవి కాలం ఇటీవలే ముగిసింది.  ఈనేపథ్యంలోనే మూడోసారి ఆయనను  నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గా నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అంతేకాక

అంతేగాక, అజిత్ దోవల్‌కు కేబినెట్‌ మంత్రి హోదా ఉంటుందని కేంద్రం స్పష్టం చేసింది. ఎన్ఎస్ఏగా ఆయన నియామకానికి మంత్రిమండలి నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. అదే విధంగా ఇక ప్రధాని మోదీ ముఖ్య కార్యదర్శిగా విశ్రాంత ఐఏఎస్ అధికారి పీకే మిశ్రాను తిరిగి నియమించారు. ఈ మేరకు మిశ్ర పునర్నియామకాన్ని కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. వీరిద్దరి పదవీకాలం ప్రధాని పదవీకాలంతో సమానంగా ఉంటుందని లేదా తదుపరి ఆదేశాల వరకు కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. నరేంద్ర మోదీ సారథ్యంలోని ఎన్డీఏ తొలిసారి అధికారంలోకి వచ్చిన 2014 మే 30న అజిత్ దోవల్ తొలిసారి ఎన్ఎస్ఏగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి నేటి వరకు ఆ పదవిలో కొనసాగుతూనే ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి