iDreamPost

నాన్నతో మాట్లాడి 6 రోజులవుతుంది.. చందు బిడ్డ మాటలు వింటే కన్నీరు ఆగదు

TV Actor Chandrakanth: బుల్లితెర ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఒక్క ఐదు రోజుల గ్యాప్ లోనే త్రినయని సీరియల్ లో నటించిన పవిత్ర జయరామ్, చంద్రకాంత్ కన్నుమూశారు.

TV Actor Chandrakanth: బుల్లితెర ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.. ఒక్క ఐదు రోజుల గ్యాప్ లోనే త్రినయని సీరియల్ లో నటించిన పవిత్ర జయరామ్, చంద్రకాంత్ కన్నుమూశారు.

నాన్నతో మాట్లాడి 6 రోజులవుతుంది.. చందు బిడ్డ మాటలు వింటే కన్నీరు ఆగదు

ఇండస్ట్రీలో ఇటీవల వరుస విషాదాలు అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు కన్నుమూయడంతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. ఐదు రోజుల క్రితం త్రినయని సీరియల్ నటి పవిత్ర జయరామ్ రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో గాయాలతో బయట పడ్డ ఆమె ప్రియుడు చంద్రకాంత్ శుక్రవారం తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపింది. కేవలం ఐదు రోజుల వ్యవధిలోనే ఇద్దరు చనిపోవడంతో బుల్లితెర ఇండస్ట్రీలో విషాదంలో మునిగిపోయింది. తాజాగా చంద్రకాంత్ కూతురు మాట్లాడిన మాటలు అందరి హృదయాలను కదిలించాయి. వివరాల్లోకి వెళితే..

బుల్లితెరపై వచ్చిన పాపులర్ సీరియల్ త్రినయని లో నటించిన పవిత్ర- చంద్రకాంత్ ఆరేళ్ళుగా సహజీవనం చేస్తున్నారు. ఇటీవల తాము పెళ్లి చేసుకోని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నామని వార్తలు కూడా వచ్చాయి. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ జంట కానరానిక లోకాలకు వెళ్లిపోయారు. చంద్రకాంత్ కి ఇప్పటికే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. 2004 లో శిల్ప అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరూ 11 ఏళ్ల పాటు లివింగ్ రిలేషన్ కొనసాగించి పెద్దల అంగీకరంతో 2015లో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక పాప, బాబు.త్రినయని సీరియల్ మొదలైనప్పటి నుంచి పవిత్ర జయరామ్ తో పరిచయం ఏర్పడి ఆ పరిచయం ప్రేమగా మారింది.పవిత్ర- చందు లివింగ్ రిలేషన్ లో ఉంటూ వచ్చారు.

ఆదివారం (మే11) న పవిత్ర జయరామ్ తన స్నేహిలతో బెంగుళూర్ నుంచి హైదరాబాద్ కి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ సమయంలో చంద్రకాంత్ కూడా కారులో ఉన్నాడు. ప్రమాదంలో పవిత్ర అక్కడిక్కడే కన్నుమూసింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురపై చంద్రకాంత్ శుక్రవారం ఆత్మహత్యకు పాల్పపడ్డాడు. చంద్రకాంత్ మృతదేహానికి ఉస్మానియాలో పోస్ట్ మార్టం పూర్తయ్యింది.. మృతదేహాన్ని బన్సీలాల్ పేట్ లోని ఆయన స్వగృహానికి తరలించారు. ఈ సందర్భంగా ఆయన కూతురు మీడియాతో మాట్లాడుతూ.. ‘నాన్న ఆరు రోజుల క్రితం నాతో మాట్లాడారు..భయపడవొద్దు.. బాగా చదువుకోవాలి తమ్ముడిని, అమ్మను జాగ్రత్తగా చూసుకోవాలని, నేను వస్తాను’ అంటూ చెప్పాడని కన్నీరు పెట్టుకుంది. అమాయకంగా మట్లాడుతే ఆ చిన్నారి మాటలు వింటే అందరి మనసు చలించిపోయింది. భార్య, పిల్లల కోసం మనసు మార్చుకొని ఎప్పటికైనా తిరిగి వస్తాడని ఎంతో ఆశించామని.. తమ ఆశలు అడియాశలు అయ్యాయని ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి