iDreamPost

మహిళపై స్పా యజమాని దాష్టీకం, జుట్టు పట్టుకుని కొట్టి, బట్టలు చించేసి..

మహిళపై స్పా యజమాని దాష్టీకం, జుట్టు పట్టుకుని కొట్టి, బట్టలు చించేసి..

ఏమైందో ఏమో తెలియదు కానీ ఓ మహిళపై వ్యక్తి నడి రోడ్డుపై ఇష్టానుసారంగా దాడి చేశాడు. ఆమెపై వాదనకు దిగడమే కాదు.. కొడుతూ, తిడుతూ విరుచుకుపడ్డాడు. అతడు అలా చేస్తుంటే.. అక్కడ ఉన్న ఓ వ్యక్తి అడ్డుచెప్పగా..అతడికి కూడా వార్నింగ్ ఇచ్చాడు. దీంతో మరో వ్యక్తి కనీసం అతడిని అడ్డుకోలేదు సరికదా.. ఏదో వింత చూసినట్లు చూస్తున్నాడు. మహిళను సదరు వ్యక్తి ఇష్టమొచ్చినట్లు కొట్టడమే కాదు.. జుట్టుపట్టుకుని లాగడం, దుస్తులు చించేయడం చేశాడు. అతడిని అడ్డుకునేందుకు మహిళ ప్రయత్నించినప్పటికీ.. విఫలమైంది. ఈ ఘటన గుజరాత్‌లో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. అతడు ఓ స్పా యజమాని అని తేలింది.

వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్‌లోని గెలాక్సీ యజమాని మొహ్సిన్.. తన బిజినెస్ పార్టనర్ అయిన 24 ఏళ్ల మహిళ పట్ల నడిరోడ్డుపై అసభ్యకరమైన రీతిలో దాడి చేశాడు. ఆమె చెంప మీద చెల్లు మనిపించాడు. అనంతరం ఆమె అతడిని అడ్డుకునేందకు ప్రయత్నించింది. అయినప్పటికీ అతడు ఆ మహిళనను వెంబడిస్తూ కొడుతూనే ఉన్నాడు. ఆమె వెళ్లిపోతున్నా..మళ్లీ చేయి పట్టుకుని లాక్కొస్తుంటే.. ఓ వ్యక్తి అడ్డువచ్చాడు. అతడిని కొట్టాడు మొహ్సిన్. ఆమె వెళ్లిపోయేందుకు ప్రయత్నించగా.. జుట్టు పట్టుకుని లాక్కొచ్చి.. ఇష్టమొచ్చినట్లు తన్నాడు. చెంపలపై కొడుతూ.. పశువులా ప్రవర్తించాడు. అక్కడితో ఊరుకోలేదు సరికదా.. మహిళను జుట్టు పట్టుకుని, నేల మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లి, బట్టలు చించేసి కొడుతూనే ఉన్నాడు.

సుమారు నాలుగు నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోలో ఆమె పూర్తిగా బట్టలు చినిగిపోయి కనిపించింది. ఈ ఘటన సెప్టెంబర్ 25న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమెను కొట్టడం చూసిన ఓ సామాజిక కార్యకర్త బోడక్ దేవ్ పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు యువతిని అతడిని రక్షించారు. అప్పటికే అతడు అక్కడి నుండి పారిపోయాడు. ఆ మహిళకు కౌన్సిలింగ్ ఇచ్చారని తెలుస్తోంది. ఇంత జరిగినా ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో.. పోలీసులు కేసు నమోదు చే సి విచారణ జరపగా.. వీరిద్దరూ బిజినెస్ పార్టనర్స్ అని, వ్యాపార లావాదేవీల్లో వాగ్వాదం జరిగి.. గొడవలు జరిగినట్టు గుర్తించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి