iDreamPost

వేసవిలో పుచ్చకాయ తింటున్నారా! ఏకంగా ప్రాణాలు పోవచ్చు! తస్మాత్ జాగ్రత్త!

  • Published May 03, 2024 | 2:40 PMUpdated May 03, 2024 | 2:40 PM

ప్రస్తుతం వేసవికాలం కావడంతో మార్కెట్ లో ఎక్కడ చూసిన ఎక్కువగా పుచ్చకాయలు దర్శనమిస్తున్నాయి. ఇక జనాలు కూడా ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఈ పుచ్చకాయలను కొనుగోలు చేస్తున్నారు. కానీ, కొంతమంది కల్తీ కేటుగాళ్లు వాటిని కూడా వదలకుండా కల్తీ చేస్తున్నారు. తాజాగా ఓ కొందరు ముఠా ఈ పుచ్చకాయలను కల్తీ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు.

ప్రస్తుతం వేసవికాలం కావడంతో మార్కెట్ లో ఎక్కడ చూసిన ఎక్కువగా పుచ్చకాయలు దర్శనమిస్తున్నాయి. ఇక జనాలు కూడా ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఈ పుచ్చకాయలను కొనుగోలు చేస్తున్నారు. కానీ, కొంతమంది కల్తీ కేటుగాళ్లు వాటిని కూడా వదలకుండా కల్తీ చేస్తున్నారు. తాజాగా ఓ కొందరు ముఠా ఈ పుచ్చకాయలను కల్తీ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు.

  • Published May 03, 2024 | 2:40 PMUpdated May 03, 2024 | 2:40 PM
వేసవిలో పుచ్చకాయ తింటున్నారా! ఏకంగా ప్రాణాలు పోవచ్చు! తస్మాత్ జాగ్రత్త!

సమ్మార్ సీజన్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేవీ మామిడి పండ్లే అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఈ ఎండాకాలంలో మామిడి పండ్లతో పాటు పుచ్చకాయలు కూడా మార్కెట్ లో ఎక్కువగా కనిపిస్తాయి. పైగా వీటికి ఈ సమ్మార్ లో మంచి గిరాకీ కూడా ఉంటుంది.చాలామంది ఈ వేసవి ఎండల నుంచి శరీరంలో నీటి శాతం పెంచుకోవడం కోసం అలాగే శరీర చలువ కోసం పుచ్చకాయలను తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. దీంతో రోడ్ల పక్కన అడుగడుగునా ఈ పుచ్చకాయలను తెగ అమ్ముతుంటారు. అయితే ఎంతో రుచికరంగా ఎర్రగా నిగనిగలాడే ఈ పండ్లను కూడా చాలామంది కల్లీ చేస్తున్నారు. అదేంటి పుచ్చకాయల్లో కల్తీ అని షాక్ అవుతున్నారు. అవును.. మీరు విన్నది నిజమే. ఇటీవలే కొంతమంది కల్తీ కేటుగాళ్లు ఈ పండ్లను కూడా వదలడం లేదు. కాగా, వాటిని కూడా కల్తీ చేస్తూ డబ్బులను సంపాదించుకుంటున్నారు.తాజాగా కొందరు ముఠా ఈ పుచ్చకాయలను కల్తీ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం పుచ్చకాయలను కల్తీ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. ఇంతకి ఎక్కడంటే..

ప్రస్తుతం వేసవికాలం కావడంతో మార్కెట్ లో ఎక్కడ చూసిన ఎక్కువగా పుచ్చకాయలు దర్శనమిస్తున్నాయి. ఇక జనాలు కూడా ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందేందుకు ఈ పుచ్చకాయలను కొనుగోలు చేస్తున్నారు. కానీ, కొంతమంది కల్తీ కేటుగాళ్లు వాటిని కూడా వదలకుండా కల్తీ చేస్తున్నారు. తాజాగా ఓ కొందరు ముఠా ఈ పుచ్చకాయలను కల్తీ చేస్తూ అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం ఆ పుచ్చకాయలను కల్తీ చేస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది.  కాగా, ఆ వీడియోలో ఆ కల్తీ ముఠాను ఓ పోలీస్ పట్టుకుని, ఆ కల్తీకి ఎలా పాల్పడుతున్నారని ప్రత్యేక్షంగా చూపించడం కనిపిస్తోంది. సాధారణంగా పుచ్చకాయలు అంటే లోపల ఎర్రగా ఉంటాయి. అయితే వాటిలో కొన్ని బాగాలేనేవి, పాడైన పుచ్చకాయలకు మాత్రం లోపల గుజ్జు తెల్లగా ఉంటుంది.  దీంతో ప్రజలు ఎర్రగా ఉన్న పుచ్చకాయలనే ఎక్కువగా కొనేందుకు ఇష్టపడుతారు.

ఇక దీనినే అదనుగా భావించిన కల్తీ ముఠా.. పుచ్చకాయల్లో ఎరుపు రంగు నింపుతూ దొరికిపోయారు. అయితే ఆ వీడియోలో సిరంజిలలో ఎరుపు రంగు నింపి ఆ పుచ్చకాయలను కల్తీ చేస్తున్నారు. కాగా, ఈ ముఠాను పక్కా సమాచారంతో దాడి చేసిన ఆ పోలీసు వారిని పట్టుకున్నారు. ఇక ఈ విషయన్ని అందరికీ తెలియజేయాలని ఉద్దేశంతో వాళ్లు చేసే మోసాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పుచ్చకాయను ఎలా కల్తీ చేస్తారనేదానిపై అందరికీ అవగాహన కలిగించేలా ఆ పండ్ల వ్యాపారి చేసే దారుణానికి సంబంధించిన వీడియోను వైరల్ చేశారు.

కాగా, ఆ వీడియోలో ఓ వ్యక్తి పుచ్చకాయలకు కలర్ కోసం ఎరుపు రంగు.. తియ్యగా ఉండేందుకు మరో ద్రవాన్ని నింపుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఆ ఎరుపు రంగును తయారు చేసేందుకు ముందుగా కొన్ని రసాయానాలను ఉపయోగించాడు. అనంతరం ఆ ద్రవాలను ఇంజెక్షన్ల ద్వారా పుచ్చకాయల్లోకి ఎక్కిస్తున్నారు. అది చూసిన పోలీస్ అధికారి కూడా ఆశ్చర్య పోయారు. ఇక దొరికిపోయిన ఆ వ్యక్తి పోలీస్‌కు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించాడు. కానీ అది తిరస్కరించిన పోలీస్.. అతడ్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించాడు. ప్రస్తుతం ఆ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ ప్రజల అవగాహన కోసం తీసిన వీడియో మాత్రమేనని, ఆ కల్తీ అనేది అంతా అబద్ధం అంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఇక కొంతమంది అయితే పుచ్చకాయలను ఇలా కూడా కల్తీ చేస్తారా అని షాక్ అవుతున్నారు. మరి, పుచ్చకాయలను కల్తీ చేస్తున్న ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి