iDreamPost

TCSలో ఫ్రెషర్స్ కోసం ఖాళీగా పడున్న 80 వేల జాబ్స్.. మీరు ట్రై చేస్తారా?

మీరు ఐటీ కంపెనీల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే టీసీఎస్ లో 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్ కు గోల్డెన్ ఛాన్స్. ట్రై చేయండి.

మీరు ఐటీ కంపెనీల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే టీసీఎస్ లో 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఫ్రెషర్స్ కు గోల్డెన్ ఛాన్స్. ట్రై చేయండి.

TCSలో ఫ్రెషర్స్ కోసం ఖాళీగా పడున్న 80 వేల జాబ్స్.. మీరు ట్రై చేస్తారా?

వరల్డ్ వైడ్ గా ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు కలవరానికి గురిచేస్తున్నది. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ లేఆఫ్స్ బాటపట్టాయి. ఉన్నట్టుండి ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే దాదాపు 80 వేల మంది ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయినట్టు నివేదికలు తెలుపుతున్నాయి. ఖర్చులు తగ్గించుకునేందుకు అదే సమయంలో ప్రాజెక్స్ట్ ఎక్కువగా రాకపోవడం కారణంగా ఐటీ సంస్థలు ఎంప్లాయీస్ ను తొలగిస్తున్నాయి. ఐటీ ఉద్యోగాలు గాల్లో దీపాలుగా మారాయి. ఇలాంటి సమయంలో దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ లో 80 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ ఆ కారణంతో నియామకాలు జరగడం లేదు.

ప్రస్తుత కాలంలో ఉద్యోగం పొందాలంటే విద్యార్హతలు, స్కిల్స్ ఉండాల్సిందే. అలా అయితేనే ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో రాణించడం సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఐటీ సెక్టార్ లో స్థిరపడాలనుకునే వారు ఎప్పటికప్పుడు స్కిల్స్ ను డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మంచి ప్యాకేజీలతో జాబ్ కొట్టొచ్చు. అయితే దిగ్గజ ఐటీ కంపెనీ టీసీఎస్ లో 80 వేల ఉద్యోగాలు రెడీగా ఉన్నాయి. ఫ్రెషర్లకు ఇది సువర్ణావకాశం. కానీ స్కిల్స్ ఉన్న అభ్యర్థులు లేని కారణంగా 80 వేల ఉద్యోగాలు భర్తీ నిలిచిపోయింది. ఉద్యోగాలు ఇస్తామన్నా కూడా అభ్యర్థులు దొరకడం లేదు. ఈ విచిత్రకరమైన పరిస్థితికి కారణం కేవలం అభ్యర్థుల్లో స్కిల్స్ లేకపోవడమే.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లో స్కిల్స్ గ్యాప్ కారణంగా 80,000 ఖాళీలను భర్తీ చేయడానికి కష్టపడుతోందని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఐటీ జాబ్స్ కోసం ఎదురుచూసే వారు ఈ జాబ్స్ కోసం ట్రై చేయొచ్చు. సరైన స్కిల్స్ ఉంటే టీసీఎస్ లో జాబ్ రెడీగా ఉన్నట్లే. అయితే ఓ వైపు ఎంపిక చేసుకున్న ఫ్రెషర్లను ఉద్యోగాలలోకి చేర్చుకోకుండా ఇలా స్కిల్‌ గ్యాప్‌ పేరుతో వేలాది ఉద్యోగాలను ఖాళీగా ఉంచడంపై ఉద్యోగార్థుల నుంచి విమర్శలు వెల్లువవెత్తుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి