iDreamPost

రూ.600 కోట్ల ఖరీదైన ఏకదంతుడు.. ఎక్కడంటే!

  • Published Sep 23, 2023 | 10:58 AMUpdated Sep 23, 2023 | 11:54 AM
  • Published Sep 23, 2023 | 10:58 AMUpdated Sep 23, 2023 | 11:54 AM
రూ.600 కోట్ల ఖరీదైన ఏకదంతుడు.. ఎక్కడంటే!

వినాయక చతుర్థి.. భారతీయులు ముఖ్య పండుగల్లో ఒక పండగ. శివపార్వతుల కుమారుడైన వినాయకుడి పుట్టినరోజునే వినాయక చవితిగా భక్తి శ్రద్దలతో ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఏ పూజ చేసినా.. ఏ వత్రం చేసినా.. ఏ శుభకార్యం మొదలు పెట్టినా ఏకదంతుడి పూజతోనే ప్రారంభం అవుతుంది. వినాయకుడు అంటే విఘ్నాలను తొలగించి విజయాలను చేకూర్చుతాడని భక్తుల నమ్మకం. ప్రతి ఇంట, వ్యాపార సంస్థలు, కార్యాలయాలు అన్ని చోట్ల లంబోధరుడిని ప్రతిష్టించుకొని పూజిస్తుంటారు. తాజాగా రూ.600 కోట్ల విలువైన వజ్ర వినాయకుడికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి ‘కనుభాయ్ అసోదరియా’ ప్రతి సంవత్సరం గణపతికి పూజలు చేస్తుంటారు. ఇందులో ప్రత్యేకత ఏముందని అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే ఆయన పూజించే వినాయకుడు సహజ సిద్దంగా ఏర్పడిన ఖరీదైన వజ్రం. 182.3 క్యారెట్లతో 36.5 గ్రాముల బరువు ఉన్న ఈ వజ్ర గణపతిని కనుభాయ్ ప్రతిఏటా వినాయక చవితి రోజు ప్రత్యేక పూజలు చేసి, నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా నదీ జలాలను విగ్రహం మీద చల్లుతారు. మరో విశేషం ఏంటంటే.. ఈ అపురూప వజ్ర వినాయకుడు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా నిరూపించబడింది. దీని విలువ మార్కెట్లో రూ.600 కోట్ల వరకు ఉంటుందని అంటున్నారు.

ఈ సందర్భంగా వజ్రాల వ్యాపారి కనుభాయ్ మీడియాతో మాట్లాడారు. తాను 15 ఏళ్ల క్రితం బెల్జియం వెళ్లానని.. అక్కడ ముడి వజ్రాలను భారత్ కు తీసుకువచ్చానని అన్నారు. అందులో ఒక వజ్రం సహజసిద్ధంగా వినాయకుడిని పోలి ఉందని అన్నారు అప్పటి నుంచి వజ్ర వినాయకుడికి నియమనిష్టలతో పూజించడం మొదలుపెట్టానని.. అన్నీ బాగా కలిసి వచ్చాయని అన్నారు. ఇది కోహినూర్ వజ్రం కన్నా పెద్దదని.. ప్రతి ఏడాది వినాయక చతుర్థి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని ఆయన అన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి