iDreamPost

హైదరాబాద్ సీసీఎస్.. 12 మంది సీఐలు, నలుగురు ఎస్సైల బదిలీ!

Hyderabad CCS: హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఈక్రమంలోనే సీసీఎస్ లోని పోలీస్ అధికారులను బదిలీలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Hyderabad CCS: హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఈక్రమంలోనే సీసీఎస్ లోని పోలీస్ అధికారులను బదిలీలు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

హైదరాబాద్ సీసీఎస్.. 12 మంది సీఐలు, నలుగురు ఎస్సైల బదిలీ!

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా అవినీత, అక్రమాలపై చర్యలకు దిగుతుంది. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ, వైద్య రంగంలో, ఆర్టీఏ లోని అవినీతి విషయంలో దాడులు నిర్వహించింది. అంతేకాక ప్రభుత్వ శాఖాల్లో కూడా ప్రక్షాళన చేస్తున్నారు. శనివారమే  20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇదే సంచలన నిర్ణయం అనుకుంటే.. తాజాగా పోలీస్ శాఖలో కూడా సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సీసీఎస్ లో భారీగా బదిలీలు చేపట్టింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ లో ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంది. ఈక్రమంలోనే సీసీఎస్ లోని పోలీస్ అధికారులను బదిలీలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 16 మంది సీసీఎస్ సిబ్బందిపై బదిలీ వేటు వేసింది. ఈ క్రమంలోనే బదిలీలు చేస్తూ.. ప్రభుత్వం ఉత్తర్వూలు జారీ చేసింది.  12 మంది సీఐలు, నలుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఉత్వర్తులు  జారీ చేశారు. అలానే వీరిని తక్షణ వెంటనే మల్జీజోన్ -2 కు రిపోర్టు చేయాలని ఉత్తర్వూల్లో పేర్కొన్నారు.  ఇప్పటికే ఈ శాఖకు చెందిన అవినీతి ఆరోపణలతో ACP ఉమామహేశ్వరరావు , CI సుధాకర్ లను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ బదిలీలు చోటుచేసుకున్నాయి.

శనివారమే 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా జిల్లాలకు నూతన కలెక్టర్లను నియమిస్తూ రాష్ట్ర సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తంగా ఈ బదిలీలతో ఆయా జిల్లాలకు కొత్త కలెక్టర్లను నియమాకం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్దిరోజులకు తాత్కాలిక బదిలీలు జరిపింది. బీఆర్ఎస్ ప్రభుత్వ సమయంలో పలు స్థానాల్లో విధులు నిర్వహిస్తున్న వారిని మార్చేందుకు సిద్ధమైంది. సరిగ్గా అదే సమయంలో సార్వత్రిక  ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో నియమావళి అమల్లోకి రావడంతో బదిలీలు నిలిచిపోయాయి. ఇటీవలే ఎన్నికల ఫలితాలు రావడంతో కోడ్ ముగిసింది. దీంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాలనాపరమైన ప్రక్షాళనలో భాగంగా పెద్దఎత్తున మార్పులు చేసింది. ఈ క్రమంలోనే ఐఏఎస్ ల బదిలీలు,  అలానే హైదరాబాద్ సీసీఎస్ లో బదిలీలు  చోటుచేసుకున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి