వాహనదారులకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు! అటు వెళ్లకండి!

నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. వాహనదారులు ఈ విషయాన్ని గ్రహించి.. వేరే రూట్లలో వెళ్లాలని అధికారులు సూచించారు. ఏఏ రూట్లలో ఆంక్షలు విధించారంటే?

నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. వాహనదారులు ఈ విషయాన్ని గ్రహించి.. వేరే రూట్లలో వెళ్లాలని అధికారులు సూచించారు. ఏఏ రూట్లలో ఆంక్షలు విధించారంటే?

ప్రత్యేక దినాల్లో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించడం సర్వసాధారణమైన విషయమే. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ లు జరిగినప్పుడు, పండుగలప్పుడు ఇతర అంతర్జాతీయ ఈవెంట్స్ నగరంలో నిర్వహించే క్రమంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తూ ఉంటారు. తాజాగా బుధవారం నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతున్న స్టాఫ్ నర్స్ రిక్రూమెంట్ ప్రోగ్రామ్ ను దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ను మళ్లించారు. వాహనదారులు ఈ విషయాన్ని గ్రహించి.. వేరే రూట్లలో వెళ్లాలని అధికారులు సూచించారు. ఇంతకీ ఏఏ రూట్లలో ఆంక్షలు విధించారో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్ లో బుధవారం ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీస్ అధికారులు తెలిపారు. ఎల్బీ స్టేడియంలో స్టాఫ్ నర్స్ రిక్రూమెంట్ ప్రోగ్రాం జరుగుతున్న కారణంగా ట్రాఫిక్ ను మళ్లించారు. పంజాగుట్ట, వీవీ విగ్రహం, రాజీవ్ గాంధీ విగ్రహం(మోనప్ప), లక్టీకపూల్, నిరంకారి, రవీంద్ర భారతి, ఇక్బాల్ మినార్, బీజేఆర్ విగ్రహం సర్కిల్, బషీర్ బాగ్, SBI గన్ ఫౌండ్రీ, అబిడ్స్ సర్కిల్ తదితర ప్రాంతాల్లో ఆంక్షలు విధించనున్నట్లు అధికారులు తెలిపారు. మధ్యాహ్ననం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు. ఈ విషయాన్ని వాహనదారులు దృష్టిలో ఉంచుకుని పని చేసే కార్యాలయాలకు వెళ్లాలని వారు సూచించారు.

Show comments