హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం.. కోట్ల రూపాయల ఆస్తి నష్టం!

ఈ మధ్యకాలంలో అగ్నిప్రమాద ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కారణం.. ఏమైనప్పటికీ ఈప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

ఈ మధ్యకాలంలో అగ్నిప్రమాద ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కారణం.. ఏమైనప్పటికీ ఈప్రమాదాల్లో ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అగ్నిప్రమాదలు జరుగుతూనే ఉంటాయి.  షార్ట్ సర్క్యూట్, రసాయనాల పేలుడు వంటి ఇతర కారణాలతో అగ్నిప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. అలానే మరెందరో కాలిన గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. అలానే ఈ ప్రమాదాల్లో భారీగా ఆస్తి నష్టం కూడా జరుగుతుంది. ఇటీవలే హైదరాబాద్ నాంపల్లి ప్రాంతంలో ఘోరో అగ్నిప్రమాదం జరిగి తొమ్మింది మంది మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లోనే మరో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ లోని మైలదేవురపల్లి ప్రాంతంలోని కాటేదాన్ పారిశ్రామిక వాడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. పహల్ ఫుడ్ బిస్కెట్ పరిశ్రమలో గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  పహల్ పుడ్ బిస్కెట్ పరిశ్రమలో తెల్లవారు సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఉదయాన్నే దట్టమైన పొగలు కమ్ముకోవడంతో స్థానికులు భయాందోళకు గురయ్యారు. స్థానికలు ఇచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజిన్ల సాయంతో అగ్నిమాపక సిబ్ంది మంటలను ఆర్పుతోంది. మిషనరీ, బిస్కెట్ తయారీ ముడిసరుకు పూర్తిగా మంటల్లో కాలి బుడిదైంది. కోట్లలో ఆస్తినష్టం వాటిల్లినట్లుగా తెలుస్తోంది. నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ పరిశ్రమలో వంద మంది సిబ్బంది విధుల్లో ఉందని సమాచారం. టాప్‌ఫ్లోర్‌లో ప్యాకింగ్ మెటీరియల్ ఉంటుందంటుదని అక్కడ వారు చెబుతున్నారు. ఇంకా మంటల్లో ఎవరైనా చిక్కుకున్నారా అని ఫైర్ సిబ్బంది చూస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ లాడ్జిలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందారు. అలానే అదే ప్రాంతంలో  హోటల్ ప్రమాదం జరిగి..ముగ్గురు సజీవ దహనం అయ్యారు.

కొన్ని నెలల క్రితం విశాఖ హర్బర్ లో జరిగిన అగ్నిప్రమాదం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో బోట్లు కాలి బూడిదగా మారాయి. ఇలాంటి  ఘటనల తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూనే ఉన్నాయి. ఇక ఎండకాలం ప్రారంభం కావడంతో ఇలాంటి  ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.  తాజాగా హైదరాబాద్ లోని కాటేదాన్ లో జరిగిన అగ్నిప్రమాదంపై  పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఏమైన ప్రాణ నష్టం జరిగిందా లేదా? అనేది తెలియాల్సి ఉంది. మరి.. ఇలాంటి ప్రమాదాల నివారణకు  ఏం చర్యలు తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments