నాన్ వెజ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్! ఈ ఆదివారం చికెన్ షాపులు బంద్! కారణం ఏంటంటే!

Hyderabad: ఆదివారం అంటే చాలా మంది నాన్ వేజ్ డే అనే గుర్తుకు వస్తుంది. కారణంగా.. వారికి సండే వచ్చింది అంటే ఇంట్లో మాంసాహారం ఉంటుంది. అయితే అలాంటి మాంసం ప్రియులకు ఓ బ్యాడ్ న్యూస్ వార్త వచ్చింది.

Hyderabad: ఆదివారం అంటే చాలా మంది నాన్ వేజ్ డే అనే గుర్తుకు వస్తుంది. కారణంగా.. వారికి సండే వచ్చింది అంటే ఇంట్లో మాంసాహారం ఉంటుంది. అయితే అలాంటి మాంసం ప్రియులకు ఓ బ్యాడ్ న్యూస్ వార్త వచ్చింది.

ఆదివారం వచ్చిందంటే చాలు.. ఎక్కువ ఇళ్లలో నాన్ వేజి వంటకాలే కనిపిస్తుంటాయి. కొందరికి అయితే నాన్ వేజ్ లేనిదే ముద్ద దిగదు. తరచూ నాన్ వేజ్ వంటలు తినేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక సండే అంటే అలాంటి వారికి పండగే. తెల్లవారగానే మాంసం విక్రయించే షాపుల ముందు క్యూ కడుతుంటారు. అలాంటి మాంసం ప్రియులకు ఇప్పుడు మనం చెప్పబోతున్న విషయం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈ ఆదివారం మాంసం దుకాణాలు బంద్ కానున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం..

ఆదివారం అంటే  గుర్తుకు వచ్చేది.. కేవలం హాలీడే అనే విషయమే కాదు.. నాన్ వేజ్ కూడా గుర్తుకు వస్తుంది. ఇక సండే రోజు మాంసం ప్రియులు చికెన్‌, మటన్‌, ఫిస్‌ షాపుల ముందు క్యూ కడతారు. ఆదివారం పూట ఎక్కువ ఇళ్లలో నాన్ వేజ్ వంటకాల గుమగుమలు గుబాళిస్తుంటాయి. ఇక వివిధ రకాల నాన్ వేజ్ వంటకలు చేసుకుని సండేను ఎంజాయ్ చేస్తుంటారు. అలా ప్రతి సండేను చాలా మంది నాన్ వేజ్ డేగానే ప్రకటించుకుని మరీ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈ ఆదివారం హైదరాబాద్ వాసులు మాంసాహారం దొరకదు. ఈ నెల 21న సిటీలోని మటన్ షాపులతో పాటు కబేళాలు, మీట్, బీఫ్ మార్కెట్స్ మూసి వేస్తున్నారు. ఈమేరకు జీహెచ్ఎంసీ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను ఆదివారం బంద్ చేయాలని హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది.

మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఉత్వర్వుల జారీ చేశారు.  మహావీర్ జయంతిని జైనులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. వారు జరుపుకునే పండగల్లో మహావీర్ అనేది అత్యంత ముఖమైనది. ఈ నేపథ్యంలోనే మహావీరుడి జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని కబేళాలతో పాటు మాంసం దుకాణాలను మూసివేయాలని ఆదేశించినట్లు జీహెచ్ ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. ఎవరైనా ఉత్తర్వూలను అతిక్రమించి నాన్ వెజ్ షాపులు ఓపెన్ చేస్తే.. కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఉత్తర్వులను అమలు చేయడంలో మున్సిపల్ సిబ్బందికి అవసరమైన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు.తిరిగి సోమవారం యథావిధిగా కబేళాలు తెరుచుకోవచ్చని కమిషనర్ పేర్కొన్నారు.

Show comments