HYDలో ఇంటి ఓనర్లకు అలర్ట్..ఆ పని చేస్తే రూ. 5 వేల ఫైన్.. GHMC కీలక నిర్ణయం!

హైదరాబాద్ లోని ఇంటి ఓనర్లకు జీహెచ్ఎంసీ హెచ్చరిక జారీ చేసింది. ఆ తప్పు చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆ వివరాలు..

హైదరాబాద్ లోని ఇంటి ఓనర్లకు జీహెచ్ఎంసీ హెచ్చరిక జారీ చేసింది. ఆ తప్పు చేస్తే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఆ వివరాలు..

వేసవి కాలం ప్రారంభం అయ్యింది. ఓ వైపు ఎండలు మండిపోతుండగా.. మరోవైపు నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో.. నదులు, చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు అడుగంటుకుపోయింది. దాంతో సాగునీరు కాదు కదా.. తాగు నీటికి కూడా తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ఇక మన పొరుగు రాష్ట్రం కర్ణాటక, బెంగళూరులో నీటి కొరత ఎంత తీవ్రంగా ఉందో చూస్తూనే ఉన్నాం. వాటర్ ప్రాబ్లం కారణంగా కంపెనీలు వర్క్ ఫ్రం హోం ఇచ్చాయి. అలానే నీటిని వృథా చేస్తే జరిమానా విధిస్తుంది. ఇప్పుడు ఈ జాబితాలోకి జీహెచ్ఎంసీ కూడా చేరనుంది. ఇంటి ఓనర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ వివరాలు..

బెంగ‌ళూరు సిటీ నీటి కొర‌త‌తో అల్లాడిపోతోంది. రోజుకు సుమారు 50 కోట్ల లీట‌ర్ల నీటి కొర‌త‌తో అక్కడి ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నీటిని వృథా చేస్తే జరిమానా కూడా విధిస్తుంది. ఇక హైదరాబాద్ లో కూడా పరిస్థితి అంత సవ్యంగా ఏం లేదు. దాంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు. జాగ్రత్త పడకపోతే హైదరాబాద్ లో కూడా బెంగళూరు లాంటి ప‌రిస్థితి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటి వృథాకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు సిద్ధమయ్యారు.

నగరవాసులు నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నా.. ప్రజల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. చాలా కాలనీలు, అపార్ట్‌మెంట్‌లు, బస్తీల్లో రోడ్లపై చిన్నపాటి కాలువలా నీళ్లు వృథాగా పారుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడం కోసం జీహెచ్‌ఎంసీ కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. ఈ దిశగా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ఈ క్రమంలో ఇంటి ఓనర్లకు హెచ్చరికలు జారీ చేసింది

ఎవరైతే నీటిని వృథా చేస్తున్నారో.. ఆ ఇంటికి రూ.5 వేలు ఫైన్ విధించనున్నారు జీహెచ్‌ఎంసీ అధికారులు. ఈ క్రమంలో అధికారులు, సిబ్బంది రోజూ ఉదయం పూట క్షేత్ర పరిశీలనకు వెళ్లనున్నారు. ఏదైనా కాలనీలు, బస్తీలు, అపార్ట్‌మెంట్‌ వద్ద నీరు వృథాగా పోతున్నట్లు కనిపిస్తే.. ఇంటి ఓనర్లకు తెలియకుండానే ఫొటోలు తీస్తారు.

ఆ తర్వాత సదరు ఇంటి యజమానులకు జరిమానా విధిస్తారు. ఈ మేరకు ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు నగరవ్యాప్తంగా కరపత్రాలు పంపిణీ చేశారు. నీటి వృథాను అరికట్టకపోతే.. హైదరాబాద్‌ మరో బెంగళూరు కావడానికి మరెంతో సమయం పట్టదని అందుకే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులు చెబుతున్నారు.

Show comments