Arjun Suravaram
తరచూ ఏదో ఒక ప్రాంతంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని పోలీసులు దేవుళ్ల వచ్చి కాపాడుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు, ఆత్మహత్యయత్నం వంటి ఘటనల్లో ఎంతో మందిని రక్షిస్తున్నారు. తాజాగా ఓ హోంగార్డు ప్రాణాలకు తెగించి ఓ యువకుడిని కాపాడాడు.
తరచూ ఏదో ఒక ప్రాంతంలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని పోలీసులు దేవుళ్ల వచ్చి కాపాడుతున్నారు. ముఖ్యంగా గుండెపోటు, ఆత్మహత్యయత్నం వంటి ఘటనల్లో ఎంతో మందిని రక్షిస్తున్నారు. తాజాగా ఓ హోంగార్డు ప్రాణాలకు తెగించి ఓ యువకుడిని కాపాడాడు.
Arjun Suravaram
ప్రస్తుత సమాజంలో చాలా మందిలో సమస్యలను ఎదుర్కొన్ని ధైర్యం కొరడవడింది. జీవితంలో ఎదురయ్యే ప్రతి చిన్న సమస్యను పెద్దగా ఊహించుకుంటారు. అంతేకాక తమకు వచ్చిన సమస్యలు, తాము పడుతున్న కష్టాలు జీవితంలో మరెవరికి లేవనే భావనలో ఉంటున్నారు. ఇక కష్టాలను ఎలా ఎదుర్కొవాలి అనే ఆలోచన చేయకుండా.. అసలు జీవితమే ముగించేయాలనే భావనలోకి చాలా మంది వస్తున్నారు. ఈ క్రమంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అయితే కొందరికి భూమి మీద నూకలు ఉండి.. ఎవరో ఒకరు రూపంలో దేవుడు వచ్చి కాపాడుతుంటారు. అలానే ఓ హోంగార్డు కూడా దేవుడిలా వెళ్లి.. ఓ వ్యక్తి ప్రాణాలను రక్షించాడు. ఈఘటన వరంగల్ లో చోటుచేసుకుంది.
సమాజాన్ని, ప్రజలను రక్షించడం పోలీసుల విధి. నేరాలను అరికడుతూ, పౌరులకు పోలీసులు రక్షణ కల్పిస్తుంటారు. అలానే ఇటీవల వివిధ రకాల ప్రమాదాలకు గురైన వారిని దేవుడిలా వెళ్లి పోలీసులు కాపాడిన సంఘటనలు అనేకం జరిగాయి. గుండెపోటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఎంతో మందికి సీపీఆర్ చేసి పోలీస్ కానిస్టేబులు బతికించారు. అలానే పొలంలో పురుగులు మందు తాగిన ఓ యువకుడిని కానిస్టేబుల్ ఒకరు రెండు కిలోమీటర్ల భుజంపై మోసుకెళ్లి ప్రాణాలు కాపాడారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. చాలా సందర్భాల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి పోలీసులు పునర్జన్మను ప్రస్తాదించారు. తాజాగా అలానే ఓ యువకుడిని ఓ హోంగార్డు రక్షించాడు. రైలు కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఆ యువకుడిని హోంగార్డు కాపాడాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఛత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన సోను అనే యువకుడు ఉపాధి నిమిత్తం వరంగల్ నగరానికి వచ్చాడు. స్థానికంగా పనులు చేసుకుంటూ కుటుంబాన్న పోషిస్తున్నాడు. అయితే ఇటీవల సోను కుటుంబం గొడవలు జరుగుతున్నాయి. కుటుంబ కలహాలతో సోను మానసికంగా వేదనకు గురయ్యాడని సమాచారం. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకోవాలని భావించి.. సమీపంలో ఉన్న రైల్వేస్టేషన్ కి వెళ్లాడు. రైల్వే పట్టాలపై పడుకుని ఉండగా.. అటుగా ఓ రైలు వస్తుంది. ఇదే సమయంలో రైలు పట్టాలపై ఉన్న సోనును రవి అనే హోంగార్డు గమనించారు.
ఒకవైపు రైలు సమీపిస్తున్నా.. ఆ యువకుడి కాపాడాలని ఆ హోంగార్డు భావించాడు. క్షణం ఆలోచించకుండా.. సోను దగ్గరకు వెళ్లి.. అతడు రాకున్న బలవంతగా పట్టుకుని పట్టాలు దాటించాడు. చివరకు ప్లాట్ ఫామ్ పైకి తీసుకొచ్చి కూర్చొబెట్టాడు. సోను పక్కకు తీసుకరాగానే.. రైలు వేగంగా అటు నుంచి వెళ్లింది. ఇలా హోంగార్డు రవి ప్రాణాలకు తెగించి ఆ యువకుడిని రక్షించాడు. దీంతో ఆయనపై అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ హోంగార్డుపై మీ ప్రశంసలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
రైలు పట్టాలపై ఆత్మహత్యాయత్నం.. రక్షించిన హోంగార్డు
వరంగల్ – ఛత్తీస్గఢ్ నుండి ఉపాధికోసం వచ్చిన సోను అనే యువకుడు కుటుంబ కలహాలతో రైలు పట్టాలపై పడుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు.. అతన్ని గమనించిన హోంగార్డు రవి ప్రాణాలకు తెగించి రక్షించాడు. pic.twitter.com/Zq8IvYaNt9
— Telugu Scribe (@TeluguScribe) March 27, 2024