4 బంతుల్లో 3 వికెట్లు.. అండర్సన్ వారసుడు దొరికాడు!

West Indies vs England: ఇంగ్లండ్ లెజెండ్ జేమ్స్ అండర్సన్ క్రికెట్​కు గుడ్​బై చెప్పేందుకు సిద్ధమయ్యాడు. వెస్టిండీస్​తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ అతడికి ఆఖరుది కానుంది. ఈ తరుణంలో అతడి వారసుడు దొరకడం విశేషం.

West Indies vs England: ఇంగ్లండ్ లెజెండ్ జేమ్స్ అండర్సన్ క్రికెట్​కు గుడ్​బై చెప్పేందుకు సిద్ధమయ్యాడు. వెస్టిండీస్​తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ అతడికి ఆఖరుది కానుంది. ఈ తరుణంలో అతడి వారసుడు దొరకడం విశేషం.

జేమ్స్ అండర్సన్.. ఈ తరం చూసిన బెస్ట్ పేస్ బౌలర్. 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ కెరీర్​లో ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్నాడీ ఇంగ్లండ్ స్పీడ్​స్టర్. 187 టెస్టుల్లో కలిపి ఏకంగా 700 వికెట్లు పడగొట్టాడు. 194 వన్డేలు ఆడి 269 వికెట్లు తీశాడు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్, అద్భుతమైన స్వింగ్, బ్యాటర్ల బలహీనతను పట్టుకొని బౌలింగ్ చేయడంలో అతడు ఆరితేరాడు. ఇంగ్లండ్​తో మ్యాచ్ అంటే చాలు.. ప్రత్యర్థి జట్లు అండర్సన్​ను తట్టుకొని ఎలా పరుగులు చేయాలా అని ప్రణాళికలు వేస్తుంటాయి. కానీ అన్నింటినీ అతడు చిత్తు చేసి వికెట్ల పండుగ చేసుకుంటాడు. విదేశాల్లోనూ సూపర్బ్​గా బౌలింగ్ చేసే అండర్సన్.. సొంతగడ్డపై మ్యాచ్ అంటే చాలు బెబ్బులిలా చెలరేగుతాడు. అలాంటోడు రిటైర్మెంట్ తీసుకోవడంతో ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు.

ఇంగ్లండ్ బౌలింగ్ అటాక్​ను రెండు దశాబ్దాలుగా లీడ్ చేసిన అండర్సన్.. వెస్టిండీస్ సిరీస్​తో క్రికెట్​కు గుడ్ బై చెప్పేస్తాడు. జట్టుకు అన్నీ తానై నిలబడిన లెజెండ్ వెళ్లిపోతుండటంతో ఫ్యూచర్​లో ఇంగ్లీష్ క్రికెట్ ఎలా ఉంటుందోనని అంతా టెన్షన్ పడుతున్నారు. అయితే వారి ఆందోళనకు చెక్ పెడుతూ రయ్​మని దూసుకొని వచ్చాడు గస్ అట్కిన్సన్. అరంగేట్ర టెస్టులోనే అండర్సన్ వారసుడ్ని తానేనని అతడు నిరూపించుకున్నాడు. విండీస్​తో జరుగుతున్న లార్డ్స్ టెస్ట్​లో అట్కిన్సన్ చెలరేగిపోయాడు. 12 ఓవర్లు వేసి ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. 5 మెయిడిన్లు వేసిన ఈ పేసర్.. 45 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఒకే ఓవర్​లో నలుగురు కరీబియన్ బ్యాటర్లను వెనక్కి పంపి ప్రకంపనలు రేపాడు.

వెస్టిండీస్ 88 పరుగులు వద్ద ఉన్నప్పుడు ఒకే ఓవర్​లో అలిక్ అతాన్జే (22), జేసన్ హోల్టర్ (0)తో పాటు జోషువా డిసిల్వా (0)ను ఔట్ చేశాడు అట్కిన్సన్. మొత్తంగా ఏడు వికెట్లతో విండీస్ పతనాన్ని శాసించాడు. అతడి దెబ్బకు ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ పేకమేడలా కూలిపోయింది. కేవలం 121 పరుగులకే విండీస్ చాప చుట్టేసింది. ఆ టీమ్​లో మిక్లీ లూయిస్ (27) టాప్ స్కోరర్. అట్కిన్సన్ బౌలింగ్ చూసిన ఇంగ్లండ్ ఫ్యాన్స్ అతడ్ని అండర్సన్ వారసుడని అంటున్నారు. నిలకడైన పేస్, పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్, తెలివిగా డెలివరీస్ వేయడం చూసి తమకు మరో అండర్సన్ దొరికాడని సంతోషంలో మునిగిపోయారు. ఇక, ఈ మ్యాచ్​లో 10 ఓవర్లు వేసిన అండర్సన్.. 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మరి.. అట్కిన్సనే మరో అండర్సన్ అనే అభిప్రాయంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments