Somesekhar
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో రోహిత్ శర్మ బ్యాడ్ కెప్టెన్సీ కారణంగా విరాట్ కోహ్లీ సాధించిన బెస్ట్ రికార్డు బద్దలైంది. మరి ఆ ఘనత ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో రోహిత్ శర్మ బ్యాడ్ కెప్టెన్సీ కారణంగా విరాట్ కోహ్లీ సాధించిన బెస్ట్ రికార్డు బద్దలైంది. మరి ఆ ఘనత ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
విరాట్ కోహ్లీ.. తన బ్యాట్ తో ఎన్నో మ్యాచ్ లను గెలిపించడమే కాక, మరెన్నో రికార్డును కూడా సాధించాడు. టీమిండియా రన్ మెషిన్ గా ప్రపంచ వ్యాప్తంగా మన్ననలు పొందుతున్న కింగ్ కోహ్లీ.. కెప్టెన్ గా సైతం అద్భుతమైన రికార్డులను సొంతం చేసుకున్నాడు. తన సారథ్యంలో టీమిండియాకు ఎన్నో విజయాలను అందించాడు. ఈ క్రమంలోనే పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు విరాట్. ఇక ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో రోహిత్ శర్మ బ్యాడ్ కెప్టెన్సీ కారణంగా కోహ్లీ సాధించిన బెస్ట్ రికార్డు బద్దలైంది. మరి ఆ ఘనత ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా సత్తా చాటింది. తొలి ఇన్నింగ్స్ లో ప్రత్యర్థిని 246 పరుగులకే కట్టడి చేసింది. అయితే రెండో ఇన్నింగ్స్ లో మాత్రం ఇంగ్లీష్ బ్యాటర్లు ఎదురు తిరిగారు. మరీ ముఖ్యంగా వన్ డౌన్ బ్యాటర్ ఓలీ పోప్ 196 పరుగుల భారీ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. సహచర బ్యాటర్ల నుంచి వచ్చిన కొద్ది సహకారంతోనే ఇండియా ముందు 231 పరుగుల లక్ష్యాన్ని ఉంచాడు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ బ్యాడ్ కెప్టెన్సీతో విరాట్ కోహ్లీ బెస్ట్ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే?
విరాట్ కోహ్లీ టీమిండియాకు కెప్టెన్ గా చేసిన హయాంలో టెస్టుల్లో రెండో ఇన్నింగ్స్ లో భారత గడ్డపై ఏ దేశం కూడా 300 పైచిలుకు స్కోర్ సాధించలేకపోయింది. కానీ ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేయించాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. తాజాగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్ లో 420 పరుగులు చేసింది. దీంతో కోహ్లీ ఖాతాలో ఉన్న అరుదైన రికార్డు బ్రేక్ అయ్యింది. విరాట్ సారథ్య పగ్గాలు అందుకున్న దగ్గర నుంచి టీమిండియాకి అద్భుతమైన విజయాలనే అందించాడు. కానీ అనూహ్యంగా అతడిని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి.. జట్టు పగ్గాలను రోహిత్ కు అప్పగించింది బీసీసీఐ.
అయితే గత కొంతకాలంగా భారత జట్టుకు సారథిగా వ్యవహరిస్తున్న రోహిత్ కూడా చిరస్మరణీయ విజయాలను అందించాడు. భారత జట్టును వరల్డ్ కప్ 2023 ఫైనల్ వరకు తీసుకెళ్లడంలో హిట్ మ్యాన్ పాత్ర తక్కువ చేయలేం. అయితే ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ లో మాత్రం రోహిత్ తన నాయకత్వ ప్రభావం చూపించడంలో కాస్త విఫలం అయ్యాడనే చెప్పాలి. ఏది ఏమైనా టీమిండియా ఈ టెస్ట్ లో విజయం సాధించే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే? 231 పరుగుల లక్ష్యాన్ని సాధించడానికి తగిన సమయం ఉంది. మరి విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు బద్దలు అవ్వడానికి రోహిత్ బ్యాడ్ కెప్టెన్సీనే కారణమా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Under Captain Virat Kohli’s era no team ever scored 300+ in second innings in India
Ollie Pope making us realise how bad Rohit Sharma is in Captaincy #INDvsENG pic.twitter.com/FanA0rvIfL
— Aarav (@sigma__male_) January 28, 2024