Somesekhar
తన తండ్రి నడిచిన బాటలోనే నడుస్తూ.. అండర్ 16 క్రికెట్ విభాగంలో సత్తాచాటుతోంది ఓ దిగ్గజ క్రికెటర్ కూతురు. మరి ఆ అమ్మాయి ఎవరు? ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
తన తండ్రి నడిచిన బాటలోనే నడుస్తూ.. అండర్ 16 క్రికెట్ విభాగంలో సత్తాచాటుతోంది ఓ దిగ్గజ క్రికెటర్ కూతురు. మరి ఆ అమ్మాయి ఎవరు? ఆ స్టార్ ప్లేయర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Somesekhar
సాధారణంగా తమ తల్లిదండ్రులు కొనసాగించిన వృత్తినే కొనసాగించాలని అనుకుంటూ ఉంటారు కొందరు. ఇంకొందరు మాత్రం తన ఫ్యామిలీకి భిన్నంగా మరేదైనా రంగంలో స్థిరపడాలని కోరుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ అమ్మాయి ఎవరో మీకు తెలుసా? ఈమె ఓ దిగ్గజ క్రికెటర్ కూతురు. తన తండ్రి నడిచిన బాటలోనే నడుస్తోంది. అండర్ -16 విభాగంలో సత్తాచాటుతూ ముందుకుసాగుతోంది. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు? ఆమె తండ్రి ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ప్రపంచ క్రికెట్ లో తండ్రీ కొడుకులు క్రికెట్ ఆటడటం, అన్నదమ్ములు క్రికెటర్ ఆడటం మనం చూశాం. కానీ చాలా అరుదైన సందర్భాల్లో మాత్రమే దిగ్గజ క్రికెటర్లు తమ కూతుర్లను క్రికెట్ లోకి తీసుకొస్తారు. కొందరు ఆటగాళ్లు కావాలని ఈ రంగంలోకి తీసుకొస్తే.. మరికొందరు తమ తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలన్న ఆశయంతో వస్తుంటారు. ప్రస్తుతం శ్రీలంకన్ అండర్-16 క్రికెట్ విభాగంలో సత్తాచాటుతోంది శ్రీలంక మాజీ క్రికెటర్ తిలకరత్నే దిల్షాన్ కూతురు లిమ్మి తిలక్ రత్నే. తన తండ్రి బాటలోనే నడుస్తూ.. శ్రీలంక మహిళల జాతీయ జట్టులోకి దూసుకొస్తోంది. అద్బుతమైన ఆటతో తండ్రి దిల్షాన్ ను మరపిస్తోంది ఈ అమ్మాయి. లంక జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించడమే లక్ష్యంగా ముందుకుసాగుతోంది ఈ బ్యూటీ.
ఇక దిల్షాన్ విషయానికి వస్తే.. లంక జట్టులో ఉన్న అతికొద్ది మంది దిగ్గజ క్రికెటర్లలో ఒకడు. అద్భుతమైన బ్యాటింగ్ తో లంక జట్టుకు ఎన్నో తిరుగులేని విజయాలను అందించాడు. తన కెరీర్ లో 87 టెస్టుల్లో 5492 పరుగులు, 330 వన్డేల్లో 10290 రన్స్, 80 టీ20ల్లో 1889 పరుగులు చేశాడు. శ్రీలంక టీమ్ లో మంచి ఆల్ రౌండర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు దిల్షాన్. ఓవరాల్ గా తన క్రికెటర్ కెరీర్ లో మెుత్తం 150 వికెట్లు పడగొట్టాడు. మరి తండ్రి బాటలో నడుస్తూ.. క్రికెట్ లో సత్తాచాటుతున్న దిల్షాన్ కూతురిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.