Worst Dismissal: క్రికెట్ చరిత్రలో ఇంతకంటే చెత్త ఔట్ మరోటి ఉండదేమో! వీడియో వైరల్..

ఓ ఆటగాడు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత దరిద్రంగా అవుట్ అయ్యాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఓ ఆటగాడు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత దరిద్రంగా అవుట్ అయ్యాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

క్రికెట్.. జెంటిల్ మెన్ గేమ్ గా గుర్తింపు పొంది, ప్రపంచ వ్యాప్తంగా కోట్లలో అభిమానులను సొంతం చేసుకుంది ఈ క్రీడ. వరల్డ్ వైడ్ గా ఫుట్ బాల్ తర్వాత మళ్లీ అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న ఏకైక ఆట క్రికెట్. ఇక ఎప్పుడైతే క్రికెట్ లోకి ఐపీఎల్ ఎంటర్ అయ్యిందో.. అప్పటి నుంచి దాని రూపురేఖలే మారిపోయాయి. ఐపీఎల్ ను ఆదర్శంగా తీసుకుని మన దేశంలోని రాష్ట్రాలతో పాటుగా ప్రపంచ దేశాలు పొట్టి లీగ్ లను ప్రారంభించాయి. కాగా.. ఈ లీగ్ ల్లో కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు నమోదు అవుతుండటం మనం చూసే ఉన్నాం. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడం మనకు తెలియంది కాదు. తాజాగా ఓ ఆటగాడు ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అత్యంత దరిద్రంగా అవుట్ అయ్యాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

తాజాగా ఓ వీడియో క్రికెట్ ప్రపంచాన్ని కడుపుబ్బా నవ్విస్తోంది. ఈ మ్యాచ్ గురించిన పూర్తి వివరాలు తెలియనప్పటికీ.. సదరు వీడియో మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తోంది. సాధారణంగా ఓ ఆటగాడు క్లీన్ బౌల్డ్, క్యాచ్ అవుట్, రనౌట్ అవుతాడు. కానీ ఈ ప్లేయర్ మాత్రం దురదృష్టాన్ని వెంటపడి మరీ కొట్టి పెవిలియన్ చేరాడు. అసలేం జరిగిందంటే? ఈ మ్యాచ్ లో బౌలర్ కనీవినీ ఎరగని రీతిలో పై నుంచి బాల్ వేశాడు. కొద్దిసేపు బంతి ఆకాశంలోనే ఉంది. ఇక ఆ బాల్ కూడా బ్యాటర్ కు దూరంగా ఎక్కడికో వెళ్లింది.

ఈ క్రమంలోనే స్ట్రైకింగ్ లో ఉన్న ఆ ఆటగాడు బాల్ ను వెంటాడి మరీ భారీ షాట్ కొట్టాడు. అయితే షాట్ సరిగ్గా కనెక్ట్ కాక బ్యాట్ ఎడ్జ్ తీసుకుని నేరుగా వెళ్లి కీపర్ చేతుల్లో పడింది. బాల్ అంత హైట్ రావడంతో.. అందరూ అంపైర్ నో బాల్ ఇస్తాడని అనుకున్నారు. కానీ అంపైర్ అనూహ్యంగా అవుట్ ఇవ్వడంతో.. బ్యాటర్ కంగుతిన్నాడు. ఇక అతడి దురదృష్టాన్ని చూసిన ప్రత్యర్థి ప్లేయర్లు పగలబడి నవ్వారు. ఈ వీడియో వైరల్ కావడంతో.. నెటిజన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచ క్రికెట్ లో ఇంత చెత్త ఔట్ మరోటి ఉండదని, నీలాంటి దురదృష్టవంతుడు ఇంకొకడు ఉండడని కామెంట్స్ చేస్తున్నారు. ఇదేం ఔట్ సామి.. నీకంటే పిల్లలు నయం కదా, అంటూ మరికొందరు రాసుకొచ్చారు. మరి ఈ విచిత్రమైన ఔట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments