Somesekhar
ఇంగ్లాండ్ డెబ్యూ బౌలర్ టామ్ హార్ట్లీ టీమిండియా నడ్డివిరిచాడు. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు హార్ట్లీ.
ఇంగ్లాండ్ డెబ్యూ బౌలర్ టామ్ హార్ట్లీ టీమిండియా నడ్డివిరిచాడు. 231 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు హార్ట్లీ.
Somesekhar
టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారింది. తొలుత టీమిండియా ఆటగాళ్లు పట్టుబిగించడంతో.. ఇంగ్లాండ్ 231 పరుగుల ఓ మోస్తారు లక్ష్యాన్ని భారత్ ముందు ఉంచింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు షాకిచ్చాడు ఇంగ్లాండ్ డెబ్యూ బౌలర్ టామ్ హార్ట్లీ. తొలి ఇన్నింగ్స్ లో భారీగా పరుగులు ఇచ్చుకున్న ఈ బౌలర్ రెండో ఇన్నింగ్స్ లో సత్తాచాటాడు. టామ్ దెబ్బకి భారత్ 7 వికెట్ల నష్టానికి 119 రన్స్ తో పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో టీమిండియా కష్టాల్లో పడింది. 231 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఊహించని షాక్ ఇచ్చాడు అరంగేట్ర బౌలర్ టామ్ హార్ట్లీ. తొలుత జైస్వాల్(15), ఆ తర్వాత బాల్ కే శుబ్ మన్ గిల్(0)ను పెవిలియన్ చేర్చి భారత్ ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. ఈ క్రమంలోనే క్రీజ్ లోకి వచ్చిన కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
ఈ క్రమంలోనే మరోసారి ఇంగ్లాండ్ కు బ్రేక్ త్రూ అందించాడు. 39 రన్స్ చేసి మంచి టచ్ లోకి వచ్చిన రోహిత్ ను ఎల్బీ రూపంలో బలిగొన్నాడు హార్ట్లీ. రాహుల్(22)ను రూట్ అవుట్ చేయగా.. అక్షర్(17)ను హార్ట్లీ పెవిలియన్ కు పంపాడు. ఆదుకుంటారు అనుకున్న అందరు బ్యాటర్లు ఔటై.. మ్యాచ్ పై పట్టును కోల్పోయారు. ఇలాంటి క్లిష్ట సమయంలో రవీంద్ర జడేజా(2) రనౌట్ రూపంలో పెవిలియన్ చేరి విమర్శలపాలైయ్యాడు. ప్రస్తుతం 40 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. విజయానికి ఇంకా 112 పరుగుల దూరంలో నిలిచింది. క్రీజ్ లో శ్రేయస్ అయ్యర్(13), శ్రీకర్ భరత్(0) బ్యాటింగ్ చేస్తున్నారు. టామ్ హార్ట్లీ 4 వికెట్లతో భారత్ నడ్డివిరిచాడు.
💥 Incredible from @benstokes38, but would you expect anything less? What a match #INDvsENG pic.twitter.com/ohic9yWRF3
— Toby Forage 🤙 (@foraggio) January 28, 2024