Nidhan
Team India: పొట్టి కప్పు చేతబట్టి స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టుకు అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది. వరల్డ్ కప్ హీరోలను చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు.
Team India: పొట్టి కప్పు చేతబట్టి స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టుకు అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది. వరల్డ్ కప్ హీరోలను చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు.
Nidhan
పొట్టి కప్పు చేతబట్టి స్వదేశంలో అడుగుపెట్టిన భారత జట్టుకు అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది. వరల్డ్ కప్ హీరోలను చూసేందుకు అభిమానులు ఎగబడుతున్నారు. బార్బడోస్ నుంచి నిన్న బయల్దేరిన టీమిండియా ఫ్లైట్ నేరుగా ఢిల్లీలో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి ఇవాళ ఉదయం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇంటికి వెళ్లింది రోహిత్ సేన. మోడీతో కలసి బ్రేక్‌ఫాస్ట్ చేసి.. ప్రపంచ కప్ విశేషాలను పంచుకున్నారు ఆటగాళ్లు. కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రాతో మోడీ కాసేపు ముచ్చటించారు. ఆ తర్వాత అక్కడి నుంచి ముంబైకి బయల్దేరింది భారత జట్టు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఫైర్ ట్రక్స్‌తో వాటర్ సెల్యూట్ చేశారు విమానాశ్రయ అధికారులు.
ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా వాంఖడేకు చేరుకోనున్నారు భారత ఆటగాళ్లు. ఈ క్రమంలో వాంఖడే స్టేడియానికి సమీపంలో ఓపెన్ బస్‌లో విక్టరీ పరేడ్ నిర్వహించనున్నారు. ఈ ప్రోగ్రామ్‌ను కళ్లారా చూసేందుకు ఇప్పటికే లక్షలాది మంది ఫ్యాన్స్ ముంబైకి చేరుకున్నారు. వాళ్ల రాకతో ముంబైలో కోలాహలం ఏర్పడింది. భారీగా అభిమానులు నగరానికి రావడంతో ట్రాఫిక్ ఏర్పడింది. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్‌కు సంబంధించిన ఓ విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నో దేశాలు తలపడిన మెగాటోర్నీలో ఒక్కో మ్యాచ్ గెలుస్తూ పోయిన టీమిండియా.. ఫైనల్ ఫైట్‌లో సౌతాఫ్రికాను ఓడించి ఛాంపియన్‌గా నిలిచి సగర్వంగా కప్పును అందుకుంది. అయితే రోహిత్ సేన దగ్గర ఉన్నది ఒరిజినల్ ట్రోఫీ కాదనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
వరల్డ్ కప్‌లో ఛాంపియన్స్‌గా నిలిచిన భారత్ దగ్గర ఉన్నది డూప్లికేట్ ట్రోఫీ అని తెలిసి అందరూ షాకవుతున్నారు. నకిలీ కప్పు కోసమా ఇంత పోరాటం చేసింది? ఇదేం ట్విస్ట్ సామి అని ఆశ్చర్యపోతున్నారు. అయితే అసలు నిజం తెలిసి కూల్ అయిపోయారు. సాధారణంగా ఐసీసీ నిర్వహించే టోర్నీలో ఒరిజినల్ ట్రోఫీని కేవలం ఫొటో షూట్ కోసం మాత్రమే అందిస్తారట. విన్నర్ టీమ్ తమ దేశానికి తీసుకెళ్లేందుకు అచ్చం అలాంటిదే ఇయర్, ఈవెంట్ లోగోతో కూడిన డూప్లికేట్ సిల్వర్‌వేర్ ట్రోఫీని ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) రూపొందించి ఇస్తుంది. అసలు ట్రోఫీ దుబాయ్‌లోని ఐసీసీ హెడ్ ఆఫీస్‌లోనే ఉంటుంది. కాబట్టి భారత్ అనే కాదు.. ఏ జట్టు కప్పు గెలిచినా అక్కడ సెలబ్రేషన్స్, ఫొటో సెషన్ వరకే దాన్ని అందిస్తారట. ఆ తర్వాత స్వదేశానికి డూప్లికేట్ ట్రోఫీతో పయనమవుతారు.