నాని భారీ మేక్ ఓవర్ దానికోసమేనా !!

న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నాని క్లాస్ నుంచి మాస్ కి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇకపై రాబోయే సినిమాల్లో నాని లుక్స్ ఎలా ఉంటాయి అనే మ్యాటర్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. దానికి సంబందించిన విషయాలు ఇలా ఉన్నాయి.

న్యాచురల్ స్టార్ నాని హిట్ 3 తో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు నాని క్లాస్ నుంచి మాస్ కి షిఫ్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇకపై రాబోయే సినిమాల్లో నాని లుక్స్ ఎలా ఉంటాయి అనే మ్యాటర్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. దానికి సంబందించిన విషయాలు ఇలా ఉన్నాయి.

రీసెంట్ గా హిట్ 3 సినిమాలో నాని వైలెంట్ యాక్షన్స్ కు అంతా షాక్ అయ్యారు. ఆల్రెడీ గతంలో నాని నుంచి మాస్ యాక్షన్ ను చూసిన కానీ ఈ సినిమాలో మాత్రం అందరు సరికొత్త నానిని చూసారన్న మాట వాస్తవం. ఏజ్ డిఫరెన్స్ లేకుండా థియేటర్స్ కు క్రౌడ్ పుల్లింగ్ చేయగలిగే యాక్టర్స్ లో నాని ముందుంటాడని చెప్పి తీరాలి. హిట్ 3 కథ కంటే కూడా నాని యాక్టింగ్ కే అంతా ఫిదా అయిపోయారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నాని ప్రేక్షకులు తమ అభిమాన హీరోని ఈ రేంజ్ లో చూసిన తర్వాత.. ఆ హీరో నెక్స్ట్ సినిమా మీద అంచనాలు పెంచుకోవడం సహజం. ఇప్పుడు నాని విషయంలో కూడా అదే జరుగుతుంది.

ఇటు నాని కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ ను ఏ మాత్రం తగ్గించకుండా ఇప్పటివరకు మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు నాని నెక్స్ట్ మూవీ కోసం భారీ రేంజ్ లో మేక్ ఓవర్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం నాని నార్త్ అమెరికా టూర్ లో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఇండియాకు రానున్నాడట ఈ హీరో. ఇక వచ్చిన వెంటనే తన నెక్స్ట్ మూవీ పట్టాలెక్కేస్తుంది. ఇది సికింద్రాబాద్ ఏరియాలో జరిగే పిరియాడికల్ డ్రామాగా ది ప్యారడైజ్ అనే పేరుతో తెరకెక్కనుంది. ఇప్పటికే మూవీ టీం నుంచి ఈ సినిమాకు సంబందించిన ఓ రా స్టేట్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. నాని లుక్ నుంచి క్యారెక్టర్ వరకు ఇప్పటివరకు చూడని విధంగా ఉంటుందనే క్లారిటీ ఇచ్చేసారు. దీనితో ఈ సినిమాపై అందరికి మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.

నానికి దసరా లాంటి మాస్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల.. ది ప్యారడైజ్ కు కూడా దర్శకత్వం వహించనున్నారు. ఈసారి దసరాకు మించిన మాస్ ఉంటుందని ఇప్పటికే టాక్ బయటకు వస్తుంది. మరి ఈ సినిమాలో నాని ఎలాంటి లుక్ తో ఆశ్చర్యపరుస్తాడో చూడాలి. ఇప్పటివరకు నానికి నార్త్ లో అంత గుర్తింపు లేదు. ఈ సినిమాతో అయినా పాన్ ఇండియా రేంజ్ లో తనదైన రికార్డ్ ను క్రియేట్ చేయాలనీ చూస్తున్నాడట నాని. కాబట్టి ఈ సినిమా ఇంపాక్ట్ చాలా గట్టిగానే ఉంటుందని అర్ధమౌతుంది. ఈసారి నాని ఎలాంటి పెర్ఫామెన్స్ ఇస్తాడో చూడాలి. మరి నాని భారీ మేక్ ఓవర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments