SNP
Pat Cummins, SRH vs KKR, IPL 2024: చివరి బాల్ వరకు థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్లో సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు కెప్టెన్ కమిన్స్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అది మ్యాచ్ ఓడినందుకు కాదు.. మరి ఎందుకో వివరంగా తెలుసుకుందాం..
Pat Cummins, SRH vs KKR, IPL 2024: చివరి బాల్ వరకు థ్రిల్లింగ్‌గా సాగిన మ్యాచ్లో సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. దీంతో ఆ జట్టు కెప్టెన్ కమిన్స్‌పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అది మ్యాచ్ ఓడినందుకు కాదు.. మరి ఎందుకో వివరంగా తెలుసుకుందాం..
SNP
గెలుపు ముంగిట్లో బొక్కబోర్లా పడటం సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు బాగా అలవాటుగా మారిపోయింది. చాలా కాలంగా ఇదే సమస్యతో బాధపడుతున్న ఎస్‌ఆర్‌హెచ్ తాజాగా ఐపీఎల్ 2024 సీజన్‌లోని తొలి మ్యాచ్‌లో కూడా విజయానికి చేరువగా వచ్చి.. ఓటమి పాలైంది. శనివారం కోల్‌కత్తాలోని ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కత్తా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చివరి ఐదు బంతుల్లో 7 పరుగులు చేయలేక ఈ మ్యాచ్‌ను చేజార్చుకుంది సన్‌రైజర్స్. ఈ మ్యాచ్ ఓటమి తర్వాత జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ తిట్టిపోస్తున్నారు. అది కెప్టెన్‌గా మ్యాచ్ ఓడిపోయినందుకు అతన్ని తిట్టడంలేదు. మరి ఏ కారణం చేత కమిన్స్‌ను తిడుతున్నారో ఇప్పుడు చూద్దాం..
209 పరుగుల టార్గెట్‌తో ఛేజింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ మంచి ఆరంభాన్ని అందించారు. ఇద్దరు కలిసి తొలి వికెట్‌కు కేవలం 5.2 ఓవర్లలోనే 60 పరుగులు జోడించారు. మయాంక్ 21 బంతుల్లో 32, అభిషేక్ 19 బంతుల్లో 32 పరుగులు చేసి.. 200 ప్లస్ టార్గెట్ ఛేజింగ్‌కు కావాల్సిన పునాదిని వేశారు. కానీ, ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి(20), ఎడెన్ మార్కర్(18) పెద్దగా రాణించకపోవడంతో.. రిక్వైర్డ్ రన్‌రేట్ పెరుగుతూ పోయింది. ఎన్రిచ్ క్లాసెన్ సృష్టించిన విధ్వంసంతో సన్‌రైజర్స్ తిరిగి మ్యాచ్‌లోకి రావడమే కాకుండా.. విజయానికి చాలా దగ్గరైంది. క్లాసెన్‌కు అబ్దుల్ సమద్ 11 బంతుల్లో 15, షాబాజ్ అహ్మద్ 5 బంతుల్లో 16 పరుగులు చేసి.. కాస్త సపోర్ట్ ఇచ్చాడు.
క్లాసెన్ 29 బంతుల్లో 8 సిక్సులతో 63 పరుగులు చేసి.. ఎస్‌ఆర్‌హెచ్ విజయానికి 2 బంతుల్లో 5 పరుగులు అవసరమైన సమయంలో కేకేఆర్ బౌలర్ హర్షిత్ రానా అద్భుతమైన డెలవరీ, సుయాష్ శర్మ సూపర్ క్యాచ్‌కు అవుట్ అయ్యాడు. అప్పుడు ఎస్ఆర్‌హెచ్‌కు ఒక బాల్‌కి 5 రన్స్ కావాలి. కనీసం బౌండరీ వెళ్లిన సూపర్ ఓవర్ ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి టైమ్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు కెప్టెన్ కమిన్స్. కమిన్స్ కూడా మంచి బ్యాటరే.. బాల్‌ను చాలా బలంగా టైమ్ చేసి కొట్టగలడు. అందుకే అతన్ని రూ.20.50 కోట్ల రికార్డు ధర పెట్టి ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ కొనుగోలు చేసింది. కానీ, కమిన్స్ మాత్రం చివరి బాల్‌ను కనీసం టచ్ కూడా చేయలేకపోయాడు. మ్యాచ్ ఓడిపోతే ఓడిపోయాం.. కనీసం బాల్‌ను టచ్ కూడా చేయలేనోడికి అన్ని కోట్లు అవసరమా అంటూ సన్‌రైజర్స్ ఫ్యాన్స్ మండిపోతున్నారు. క్లాసెన్ పోరాటం వృథా అయిందని, ఓ సాధారణ టెయిలెండర్ కంటే దారుణంగా.. కమిన్స్ కనీసం బాల్‌ను టచ్ కూడా చేయకపోవడం ఎస్‌ఆర్‌హెచ్ అభిమానులు ఆగ్రహానికి కారణమైంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Harshit Rana has Silenced Pat Cummins today 😂😂😂😂#IPL2024 #KKRvSRH pic.twitter.com/rr2SQa5W6o
— Progress bar 2024 (@2024_Progress) March 23, 2024