Shreyas Iyer: సెలెక్టర్లు పక్కనపెట్టడంతో.. అయ్యర్‌ సంచలన నిర్ణయం!

సెలక్టర్లు ఆఫ్గానిస్తాన్ తో జరిగే టీ20 సిరీస్ కు తనను పక్కన పెట్టడంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు శ్రేయస్ అయ్యర్.

సెలక్టర్లు ఆఫ్గానిస్తాన్ తో జరిగే టీ20 సిరీస్ కు తనను పక్కన పెట్టడంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు శ్రేయస్ అయ్యర్.

శ్రేయస్ అయ్యర్.. ప్రస్తుతం టీమిండియా క్రికెట్ లో హాట్ టాపిక్ గా మారిన ఆటగాడు. దానికి కారణాలు లేకపోలేదు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ కు ఎంపికైన అయ్యార్ కు.. బ్యాటింగ్ చేసే అవకాశం దక్కలేదు. ఇక టెస్టుల్లో దారుణంగా విఫలం అయ్యాడు. దీంతో ఆఫ్గానిస్తాన్ తో జరిగే మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ కు అతడిని పక్కన పెట్టింది టీమిండియా మేనేజ్ మెంట్. తాజాగా జరిగిన టెస్టు మ్యాచ్ ల్లో రాంగ్ షాట్ సెలక్షన్ తో పాటుగా కొన్ని క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అయ్యర్ ను జట్టు నుంచి తప్పించారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తను టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఖండించారు. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశాడు. ఇక సెలక్టర్లు తనను పక్కన పెట్టడంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు అయ్యర్.

జట్టులో క్రమ శిక్షణ చర్యల ఉల్లంఘన, సఫారీ సిరీస్ లో రాంగ్ షాట్ సెలెక్షన్ వల్ల శ్రేయస్ అయ్యర్ ను ఆఫ్గానిస్తాన్ తో జరిగే టీ20 సిరీస్ కు పక్కన పెట్టారని పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ న్యూస్ పై టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సైతం స్పందించాడు. అయ్యర్ ను పై కారణాల చేత జట్టు నుంచి తప్పించలేదని ద్రవిడ్ పేర్కొన్నాడు. జట్టులో అందరూ అద్భుతమైన ఆటగాళ్లు ఉండటంతో.. అందరికీ ఆడే అవకాశాలు రావని, అందుకే అయ్యర్ ను అలా పక్కకు పెట్టామని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు. త్వరలోనే అతడు జట్టులోకి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక సెలెక్టర్లు ఆఫ్గాన్ తో సిరీస్ కు తనను పక్కకు పెట్టడంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు అయ్యర్.

ముంబై టీమ్ తరఫున ప్రస్తుతం జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024లో ఆడాలని నిర్ణయించుకున్నాడు శ్రేయస్ అయ్యర్. అదీకాక ఆంధ్రతో జరగబోయే మ్యాచ్ కు ముంబై శ్రేయస్ అయ్యర్ ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. టీమిండియా మేనేజ్ మెంట్ సైతం అతడిని రంజీల్లో ఆడించాలని భవించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే అయ్యర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సాధారణంగా ఆటగాళ్లు ఇలా జట్టులో చోటు కోల్పోయినప్పుడు, లేదా ఫామ్ కోల్పోయినప్పుడు డొమెస్టిక్ క్రికెట్ టోర్నీలు ఆడి.. తమ సత్తా నిరూపించుకుంటూ ఉంటారు. ఇప్పుడు అయ్యర్ కూడా అదే పనిలో ఉన్నాడు. రంజీల్లో అద్భుతంగా రాణించి.. త్వరలోనే ఇంగ్లాండ్ తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నాడు శ్రేయస్. మరి అయ్యర్ రంజీల్లో ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments