SNP
SNP
క్రికెట్‌లో ఆటగాళ్లకు పలురకాల అవార్డులు ఇస్తుంటారు. మ్యాచ్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాడికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అలాగే సిరీస్ మొత్తం అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన క్రికెటర్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు బహుకరిస్తుంటారు. ఇది అన్ని సిరీస్‌లలోనూ ఉంటుంది. అయితే.. ఈ అవార్డు కింద డబ్బులు ఇస్తారు. గతంలో కార్లు, బైకులు కూడా ఇచ్చేవారు. ఇప్పుడు ఎక్కువగా నగదు రూపంలోనే ఈ అవార్డులు అందిస్తున్నారు. అయితే.. తాజాగా క్రికెట్ చరిత్రలోనే తొలిసారి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గెలిచిన ఓ క్రికెటర్‌కు ఏకంగా భూమిని బహుమతిగా అందజేశారు. మన లెక్క ప్రకారం అర ఎకరం భూమిని ఆ క్రికెటర్‌కు అందించారు. అది కూడా అమెరికా ల్యాండ్.
ఇలాంటి అరుదైన ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు బహూకరించింది ఎక్కడంటే.. ఆదివారం ముగిసిన జీటీ20 లీగ్‌లో. కెనడా వేదికగా జరిగిన ఈ లీగ్‌లో మాంట్రియల్ టైగర్స్ జట్టు సభ్యుడు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ ఈ అవార్డును అందుకున్నాడు. ఈ కరేబియన్ క్రికెటర్ జీటీ20 లీగ్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. మాంట్రియల్ టైగర్స్ జట్టు ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించిన రూథర్‌పోర్డ్‌కు నిర్వాహకులు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కింద.. అమెరికాలో అరెకరం భూమిని అందించారు. అగ్రరాజ్యం అమెరికాలో రెంట్‌కు ఉన్నాచాలని చాలా మంది అనుకుంటారు. కానీ అలాంటి దేశంలో ఏకంగా అరెకరం స్థలం అంటే గొప్ప విషయమే. అయితే.. అది ఏ ప్రాంతంలో ఇచ్చారో మాత్రం ఇంకా వివరాలు తెలియవు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆదివారం సర్రే జాగ్వర్స్-మాంట్రియల్ టైగర్స్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సర్రే జాగ్వర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కేవలం 130 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్లు మొహమ్మద్ హరీస్ 23, జితిందర్ సింగ్ 56, అయాన్ ఖాన్ 26 పరుగులతో రాణించారు. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంట్రియల్ టైగర్స్ సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసి గెలిచింది. ఈ టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శన చేసిన రూథర్‌ఫోర్డ్ ఈ మ్యాచ్‌లోనూ 38 పరుగులతో రాణించాడు. అలాగే ఓపెనర్ క్రిస్ లీన్ 31 రన్స్‌తో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ టోర్నీ మొత్తం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న రూథర్‌పోర్డ్, ఫైనల్‌లోనూ రాణించడంతో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీతో పాటు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులును సైతం గెలుచుకున్నాడు. మరి రూథర్‌ఫోర్డ్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు కింద అరెకరం భూమి ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Sherfane Rutherford gets 1/2 acre land in the USA for winning the Player Of The Series award in the GT20 Canada. pic.twitter.com/iLaWs39A9I
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 7, 2023
ఇదీ చదవండి: అమెరికా వీధుల్లో జడేజా సూపర్ డాన్స్.. వీడియో వైరల్!