Sarfaraz Khan: వీడియో: గ్రౌండ్ లో కన్నీళ్లు పెట్టుకున్న సర్ఫరాజ్ భార్య!

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ ద్వారా టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు డొమెస్టిక్ క్రికెట్ స్టార్ సర్ఫరాజ్ ఖాన్. కెరీర్ లో తన తొలి ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడి భార్య భావోద్వేగానికి లోనైంది.

ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ ద్వారా టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు డొమెస్టిక్ క్రికెట్ స్టార్ సర్ఫరాజ్ ఖాన్. కెరీర్ లో తన తొలి ఆడుతున్నాడు. ఈ క్రమంలో అతడి భార్య భావోద్వేగానికి లోనైంది.

టీమిండియా జాతీయ జట్టుకు ఆడాలని ప్రతీ ఒక్క యంగ్ క్రికెటర్ కలలు కంటూ ఉంటాడు. అందుకోసం అహోరాత్రులు శ్రమిస్తారు. ఎన్నో కష్టాలను, నష్టాలను ఎదుర్కొని తమ డ్రీమ్ నెరవేరిన రోజున వారి సంతోషానికి అవధులుండవు. ప్రస్తుతం ఇలాంటి సంతోషాన్నే టీమిండియా డెబ్యూ ప్లేయర్ సర్పరాజ్ ఖాన్ అనుభవిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కు టీమిండియా నుంచి పిలుపొచ్చింది సర్ఫరాజ్ కు. దీంతో అతడితో పాటుగా కుటుంబ సభ్యులు సైతం సంతోషంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ క్రమంలోనే గ్రౌండ్ లోనే కన్నీరు పెట్టుకుంది సర్ఫరాజ్ భార్య. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సర్ఫరాజ్ ఖాన్.. భారత డొమెస్టిక్ క్రికెట్ లో ఈ పేరు ఓ సంచలనం. టన్నుల కొద్ది పరుగులు చేయడమే కాకుండా.. అభినవ బ్రాడ్ మన్ గా కితాబు అందుకున్నాడు ఈ స్టార్ ప్లేయర్. దేశవాలీ క్రికెట్ లో సెంచరీల మీద సెంచరీలు సాధిస్తున్నా.. సెలెక్టర్ల నుంచి మాత్రం పిలుపురాలేదు. దీంతో మరింత కసిగా ఆడి పరుగుల వరదలు పారించాడు. ఇక అతడి ఆట చూసిన సెలెక్టర్లు ఎట్టకేలకు ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్ట్ లో అవకాశం కల్పించారు. దీంతో తన డ్రీమ్ నెరవేరింది. కాగా.. రాజ్ కోట్ వేదికగా మ్యాచ్ ప్రారంభానికి ముందు సర్ఫరాజ్ టీమిండియా దిగ్గజ బౌలర్ అనిల్ కుంబ్లే చేతులమీదుగా క్యాప్ అందుకున్నాడు. దీంతో అతడి ఆనందాన్ని హద్దుల్లేకుండా పోయింది. తన సంతోషాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పంచుకున్నాడు.

సర్ఫరాజ్ టీమిండియా క్యాప్ అందుకోవడంతో అతడి తండ్రి భావోద్వేగానికి గురైయ్యాడు. కొడుకును గట్టిగా హత్తుకుని, క్యాప్ ను ముద్దాడాడు. ఈ క్రమంలోనే తన భర్త ఎన్నో సంవత్సరాలుగా కంటున్న కల ఈ రోజు నెరవేరడంతో.. కన్నీటి పర్యంతమైంది సర్ఫరాజ్ భార్య. ఏడుస్తున్న తన భార్య కన్నీళ్లను తుడిచాడు ఈ డెబ్యూ ప్లేయర్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి మ్యాచ్ లోనే సత్తాచాటాడు సర్ఫరాజ్ ఖాన్. ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ స్పీడ్ గా పరుగులు రాబట్టాడు. 66 బంతుల్లోనే 9 ఫోర్లు, ఓ సిక్స్ తో 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ గా వెనుదిరిగాడు. లేకపోతే అతడి ఊపుచూస్తే కచ్చితంగా సెంచరీ చేసేవాడే. తొలిరోజు రోహిత్, జడేజాలు సెంచరీలు చేయడంతో.. భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది.

ఇదికూడా చదవండి: Ravindra Jadeja: సూపర్‌ సెంచరీ.. గాయం నుంచి కోలుకుని గర్జించిన జడేజా!

Show comments