Somesekhar
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో ఓడిపోయి బాధలో ఉన్న టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. రెండో టెస్ట్ కు స్టార్ ప్లేయర్ దూరం కానున్నాడని క్రికెట్ వర్గాల సమాచారం.
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో ఓడిపోయి బాధలో ఉన్న టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. రెండో టెస్ట్ కు స్టార్ ప్లేయర్ దూరం కానున్నాడని క్రికెట్ వర్గాల సమాచారం.
Somesekhar
హైదరాబాద్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియాకు అనూహ్య పరాభవం ఎదురైంది. లక్ష్యం 231 పరుగులే కావడం, కావాల్సినంత సమయం ఉండటంతో.. టీమిండియా చాలా సింపుల్ గా గెలుస్తుందని అందరూ భావించారు. కానీ ఇంగ్లాండ్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ దెబ్బకు భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. అతడు 7 వికెట్లతో టీమిండియా పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్ లో మూకుమ్మడిగా బ్యాటర్లు విఫలం కావడంతో.. 28 రన్స్ తేడాతో ఓటమి చెందాల్సి వచ్చింది. అయితే ఓటమి బాధలో ఉన్న టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. గాయంతో స్టార్ ప్లేయర్ రెండో టెస్ట్ కు దూరం కానున్నాడని సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో ఓడిపోయి బాధలో ఉన్న టీమిండియాకు మరో బిగ్ షాక్ తగిలింది. జట్టు స్టార్ ప్లేయర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రెండో టెస్ట్ కు దురం కానున్నాడని సమాచారం. జడేజా తొడ కండరాల నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడని తెలుస్తోంది. అయితే అతడు రెండో టెస్ట్ కు జట్టుతో పాటు వెళ్లినా.. అక్కడి నుంచి నేరుగా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ(NCA)కు తరలిస్తారని క్రీడా వర్గాల నుంచి విశ్వసనీయ సమాచారం.
అయితే ఒకవేళ గాయం పెద్దది అయ్యి జడేజా రెండో టెస్ట్ కు అందుబాటులో లేకపోతే.. టీమిండియాకు ఎదురుదెబ్బనే చెప్పాలి. ఎందుకంటే? తొలి టెస్ట్ లో ఇటు బ్యాట్ తో, అటు బాల్ తో రాణించాడు జడ్డూ భాయ్. ఇలాంటి ప్లేయర్ జట్టుకు దూరమైతే.. టీమ్ పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 87 పరుగులు చేసి రాణించాడు జడేజా. రెండో ఇన్నింగ్స్ లో దురదృష్టవశాత్తు రనౌట్ అయ్యాడు. కాగా.. జడేజా దూరం అయితే అతడి ప్లేస్ లోకి ఎవరిని తీసుకుంటారన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.
Ravindra Jadeja doubtful for the 2nd Test against England. (News18). pic.twitter.com/NkTNCaYIhI
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 28, 2024