SNP
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మధ్యలో ఇండియాకు గుడ్‌న్యూస్ అందింది. ఇప్పటికే మ్యాచ్‌పై పట్టుసాధించి ఉన్న టైమ్‌లో ఈ విషయం మరింత బూస్ట్ ఇచ్చేలా ఉంది. మరి ఆ గుడ్‌న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మధ్యలో ఇండియాకు గుడ్‌న్యూస్ అందింది. ఇప్పటికే మ్యాచ్‌పై పట్టుసాధించి ఉన్న టైమ్‌లో ఈ విషయం మరింత బూస్ట్ ఇచ్చేలా ఉంది. మరి ఆ గుడ్‌న్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
SNP
రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా పట్టుబిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసి.. 445 పరుగులు చేసిన ఇండియా.. ఇంగ్లండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌట్ చేసింది. ప్రస్తుతం టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి పటిష్ఠస్థితిలో ఉంది. ఇప్పటికే ఇంగ్లండ్ 374 పరుగుల టార్గెట్ ఉంది. ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే.. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఇండియా బౌలర్లపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 207 పరుగులు చేసి పటిష్ఠస్థితిలో నిలిచింది. రెండో రోజు సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్ మాత్రమే ఒక్కో వికెట్ తీశారు. మిగతా బౌలర్లు ఇంగ్లండ్‌ను ఇబ్బంది పెట్టలేకపోయారు. అయితే.. ఆట రెండో రోజు తీసుకున్న ఆ ఒక్క వికెట్‌తో టెస్ట్ క్రికెట్‌లో 500 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.
భారత్ తరఫున టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. కానీ, రెండో రోజు ఆట ముగిసిన తర్వాత అశ్విన్ జట్టును వీడి అందరిని షాక్‌కి గురిచేశాడు. తన తల్లి ఆరోగ్యం పరిస్థితి బాగాలేకపోవడంతో హుటాహుటిన చెన్నైకి వెళ్లిపోయాడు. అయితే.. అశ్విన్ టీమ్‌లో లేకపోతే.. భారత జట్టుకు ఇబ్బందులు తప్పవని అంతా భావించారు. కానీ, మూడో రోజు ఆటలో మొహమ్మద్ సిరాజ్, కుల్దీప్, జడేజా చెలరేగి ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేశారు. అయినా కూడా ఇంగ్లండ్‌ను రెండో టెస్ట్‌లో కట్టడి చేయాలంటే కచ్చితంగా అశ్విన్ లాంటి సీనియర్ బౌలర్ ఉండాల్సిందే. తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ చేసినంత మాత్రానా రెండో ఇన్నింగ్స్‌లో కూడా ఇంగ్లండ్‌ను నలుగురు బౌలర్లే హ్యాండిల్ చేయగలరు అనుకోవడం తప్పు. అందుకే అశ్విన్ రాకకోసం క్రికెట్ అభిమానులతో పాటు, టీమ్ మేనేజ్‌మెంట్ సైతం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇంగ్లండ్ టీమ్‌కు బ్యాడ్ న్యూస్ చెబుతూ.. టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. రవిచంద్రన్ అశ్విన్ తిరిగి జట్టులో చేరనున్నాడు. నాలుగో రోజు లంచ్ టైమ్ కల్లా అశ్విన్ టీమ్‌తో పాటు చేరి.. మ్యాచ్‌లో కూడా భాగం కానున్నాడు. ఈ గుడ్‌న్యూస్‌తో ఒక్కసారిగా టీమ్‌లో కూడా జోష్ వచ్చింది. అశ్విన్ లాంటి సీనియర్ బ్యాటర్ టీమ్‌లో ఉంటే.. బౌలింగ్‌లో ఎలాంటి ఇంప్యాక్ట్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా అశ్విన్ చెలరేగితే.. ప్రత్యర్థి వికెట్లు టపటపా పడిపోవాల్సిందే. 450కి పైగా టార్గెట్‌ను ఛేదించేందుకు ఇంగ్లండ్ కచ్చితంగా తమ బజ్‌బాల్ స్ట్రాటజీనే ఉపయోగిస్తుంది. అలాంటి టైమ్‌లో అశ్విన్ తన మాస్టర్ మైండ్‌తో వారిని అడ్డుకునే ఛాన్స్ ఉంది. మరి అశ్విన్ తిరిగి టీమ్‌లోకి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Ravi Ashwin likely to reach Rajkot by Lunch today. (Espncricinfo). pic.twitter.com/SUv9hHPWD6
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 18, 2024