Rajat Patidar: ఇంగ్లండ్‌పై 151 రన్స్‌తో రెచ్చిపోయిన RCB ఆటగాడు పటీదార్‌!

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్ వర్సెస్ ఇండయా-ఏ జట్ల మధ్య అనధికార టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా యువ బ్యాటర్ రజత్ పాటీదార్ వీరోచిత శతకంతో విధ్వంసం సృష్టించాడు.

అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్ వర్సెస్ ఇండయా-ఏ జట్ల మధ్య అనధికార టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా యువ బ్యాటర్ రజత్ పాటీదార్ వీరోచిత శతకంతో విధ్వంసం సృష్టించాడు.

టీమిండియాలో ఎంతో మంది టాలెంటెడ్ ప్లేయర్లు ఉన్నారు. తమ ఆటతీరుతో భారత జట్టులోకి రాకెట్ కంటే వేగంగా జట్టులోకి దూసుకొస్తున్నారు. దీంతో ఎవరిని టీమ్ లోకి తీసుకోవాలి? అనే తలనొప్పి సెలెక్టర్లకు స్టార్ట్ అయ్యింది. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో యంగ్ ప్లేయర్లు రెచ్చిపోయి ఆడుతున్నారు. ఇదిలా ఉండగా.. అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్ లయన్స్ వర్సెస్ ఇండయా-ఏ జట్ల మధ్య అనధికార టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా యువ బ్యాటర్ రజత్ పాటీదార్ వీరోచిత శతకంతో విధ్వంసం సృష్టించాడు. ఒక పక్క సహచర ఆటగాళ్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నా.. ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్ లో 151 రన్స్ తో రెచ్చిపోయాడు.

ఇంగ్లండ్ లయన్స్ తో జరుగుతున్న అనధికార టెస్ట్ మ్యాచ్ లో ఇండియా-ఏ జట్టు ప్లేయర్ రజత్ పాటీదార్ థండర్ ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ లయన్స్ జట్టు తమ తొలి ఇన్నింగ్స్ ను 553/8 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా-ఏ జట్టుకు చుక్కలు చూపించారు ఇంగ్లండ్ బౌలర్లు. దాంతో ఓ దశలో 95 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో బౌలర్లు తుషార్ దేశ్ పాండే, నవదీప్ సైనీలతో కలిసి భారత జట్టు పరువు కాపాడాడు రజత్ పాటీదార్. ఇంగ్లండ్ లయన్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి, ఫోర్లు, సిక్సర్లతో మెరుపులు మెరిపించాడు.

దీంతో రెండో ఆటముగిసే సమయానికి భారత్-ఏ జట్టు 8 వికెట్ల నష్టానికి 215 రన్స్ చేసింది. రజత్ పాటీదార్ 132 బంతుల్లో 140 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఇక ఈ 140 పరుగుల్లో బౌండరీల ద్వారానే వందకు పైగా రన్స్ చేయడం విశేషం. 91 బంతుల్లో 89 రన్స్ తో ఉన్న రజత్.. ఆ తర్వాత వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సులు కొట్టి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అప్పటికి భారత్ స్కోర్ 150 మాత్రమే. అంటే మీరే అర్ధం చేసుకోవచ్చు పాటీదార్ ఊచకోత ఏ రేంజ్ లో సాగిందో. ఇక మూడో రోజు ఆట ప్రారంభించిన తర్వాత 11 పరుగులు మాత్రమే జోడించి.. 158 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్ లతో 151 రన్స్ చేసి పెవిలియన్ కు చేరాడు. దీంతో 227 పరుగులకు భారత్-ఏ జట్టు ఆలౌట్ అయ్యింది.

ఈ క్రమంలోనే టోటల్ స్కోర్ లో పటీదార్ మినహా మిగిలిన ప్లేయర్లు అంతా కలిసి చేసిన పరుగులు 67 మాత్రమే. అతడు సెంచరీ సాధించకపోయి ఉంటే.. టీమిండియా పరువుపోయి ఉండేదే. ఇక పటీదార్ విధ్వంసంతో ఆర్సీబీ అభిమానులు తెగ మురిసిపోతున్నారు. ఎందుకంటే? ఐపీఎల్ దగ్గర్లోనే ఉంది కాబట్టి.. ఇదే ఫామ్ ను కొనసాగిస్తే.. జట్టుకు తిరుగులేని విజయాలు దక్కుతాయన్నది వారి ఆశ. దీకాక ఇంగ్లండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు కూడా తాను సిద్దంగా ఉన్నానని సెలెక్టర్లకు తన సెంచరీతో సవాల్ విసిరాడు. మరి పటీదార్ విధ్వంసకర శతకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments