SNP
Gautam Gambhir, Virat Kohli, IND vs SL:
Gautam Gambhir, Virat Kohli, IND vs SL:
SNP
శ్రీలంకతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ కోసం స్క్వౌడ్‌ను ప్రకటించారు భారత సెలెక్టర్లు. ఈ ఒక్క ఎంపికతో చాలా విషయాలపై క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. టీమిండియా టీ20 కెప్టెన్, వన్డేల్లో రోహిత్ వారసుడు.. ఇలా ప్రశ్నలకు బదులు దొరికింది. అలాగే హార్ధిక్ పాండ్యాకు షాకిస్తూ.. టీ20 కెప్టెన్సీ ఇవ్వకపోగా, ఉన్న వైస్ కెప్టెన్సీ పోస్టును కూడా పీకేసింది. టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను నియమించింది. వీటితో పాటే.. టీ20 వరల్డ్ కప్ 2024తో తర్వాత రెస్ట్ తీసుకుంటారనుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. అయితే.. విరాట్ కోహ్లీ వన్డే సిరీస్ ఆడటం వెనుక కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హస్తం ఉన్నట్లు సమాచారం.
నిజానికి శ్రీలంకతో వన్డే సిరీస్‌కు దూరంగా ఉండి.. కాస్త రెస్ట్ తీసుకోవాలని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భావించిన మాట వాస్తవమే. అలాగే బీసీసీఐ కూడా సీనియర్లు రోహిత్, కోహ్లీ, బుమ్రాలకు రెస్ట్ ఇవ్వాలని భావించింది కానీ, హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్‌కు ఇదే తొలి వన్డే సిరీస్ కావడంతో స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడితే బాగుంటుందని గంభీర్ పట్టుబట్టినట్లు తెలుస్తోంది. పైగా విరాట్ కోహ్లని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేసి.. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో తప్పక ఆడాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. గంభీర్ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడంతోనే శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో ఆడేందుకు కోహ్లీ అంగీకరించినట్లు సమాచారం.
హెడ్ కోచ్‌గా తన తొలి వన్డే సిరీస్‌ను సక్సెస్‌ఫుల్‌గా లీడ్ చేయాలని గంభీర్ భావిస్తున్నాడు. అయితే.. శ్రీలంకలో శ్రీలంకను ఓడించాలంటే యంగ్ టీమ్‌తో కష్టమని భావించిన గంభీర్.. లంక పిచ్‌లపై ఎంతో అనుభవం ఉన్న విరాట్ కోహ్లీ ఉంటే హెడ్ కోచ్‌గా తన ఫస్ట్ వన్డే టార్గెట్ సక్సెస్ అవుతుందని భావించిన గంభీర్.. కోహ్లీకి ఫోన్ చేసి.. శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడాలని, హెడ్ కోచ్‌గా ఇది నా తొలి సిరీస్ అని చెప్పడంతో కోహ్లీ ఒప్పుకున్నట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హాట్ టాపిక్ వైరల్ అవుతోంది. ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నా దేశం కోసం గంభీర్ కోరడంతో వెంటనే కోహ్లీ ఒప్పుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Virat Kohli informed the BCCI that he’ll be available for the ODI series against Sri Lanka, on request of Gautam Gambhir as it will be his first series as a coach. (Express Sports). pic.twitter.com/yZgIaNxUP6
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 18, 2024