SNP
Ollie Pope, India vs England: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి దగ్గరవుతున్న క్రమంలో ఓ ఆటగాడు ఎదురుతిరిగాడు. ఒక చిన్న ఐడియాతో టీమిండియాకు చుక్కలు చూపిస్తున్నాడు. అందర్ని అవుట్ చేసినా.. అతన్ని మాత్రం మనోళ్లు ఎందుకు అవుట్ చేయలేకపోతున్నారంటే..
Ollie Pope, India vs England: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి దగ్గరవుతున్న క్రమంలో ఓ ఆటగాడు ఎదురుతిరిగాడు. ఒక చిన్న ఐడియాతో టీమిండియాకు చుక్కలు చూపిస్తున్నాడు. అందర్ని అవుట్ చేసినా.. అతన్ని మాత్రం మనోళ్లు ఎందుకు అవుట్ చేయలేకపోతున్నారంటే..
SNP
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ ఆసక్తికరంగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియాకు తలొంచిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్ లో మాత్రం పోరాటం చేస్తోంది. నిజానికి ఇంగ్లండ్ టీమ్ మొత్తం పోరాటం చేస్తోంది అనే కంటే.. ఒకే ఒక్కడు ఇండియాకు ఎదురుతిరిగాడు అని చెప్పడం సముచితంగా ఉంటుంది. ఆ ఒక్కడే ఓలీ పోప్. ఈ ఇంగ్లండ్ యువ క్రికెటర్.. టీమిండియా బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. ఒక బ్రిలియంట్ ఐడియాతో భారత్ కు చుక్కలు చూపించాడు. అయితే.. ఇంగ్లండ్ టీమ్ మొత్తాన్ని మడతపెడుతున్న టీమిండియా బౌలర్లకు ఈ పోప్ ఒక్కడే ఎలా కొరకరాని కొయ్యగా మారాడు అనేదే ప్రస్తుతం భారత క్రికెట్ అభిమానులకు అర్థం కావడం లేదు. ఇంతకీ ఈ పోప్ పటిష్టమైన టీమిండియా బౌలింగ్ ను ఎలా డీకోడ్ చేయగలుగుతున్నాడో ఇప్పుడు చూద్దాం..
ఇంగ్లండ్ బ్యాటర్లు స్పిన్ బౌలింగ్ ను అంత సమర్థవంతంగా ఆడలేరనే విషయం ప్రపంచం మొత్తానికి తెలిసిందే. క్వాలిటీ స్పిన్, పిచ్ కూడా స్పిన్ కు అనుకూలించేది అయి ఉంటే.. ఇక వారి పరిస్థితి పసికూన కంటే దారుణంగా ఉంటుంది. ఇప్పుడు ఉప్పల్ పిచ్ పై ఇంగ్లండ్ టీమ్ పరిస్థితి అలాగే ఉంది. కానీ, పోప్ ఒక్కడే వేరే టీమ్ నుంచి వచ్చి ఆడుతున్నట్లు ఆడుతున్నాడు. అందుకు కారణం.. మిగతా బ్యాటర్ల కంటే కూడా డిఫెరంట్ గా ఆడుతున్నాడు. బౌలింగ్ కు తగినట్లు టీమిండియా కెప్టెన్ ఫీల్డింగ్ సెట్ చేసి పెడుతున్నాడు, బౌలర్లు కూడా ఫీల్డ్ తగ్గట్లు బంతులేస్తున్నారు. దాంతో పరుగులు రావడం కష్టంగా మారింది.
ఇక్కడే పోప్ తన తెలివిని ప్రదర్శించాడు. ప్రాపర్ క్రికెట్ ఆడితే ఫలితం లేదని.. రివర్స్ స్విప్ షాట్లు ఆడటం మొదలుపెట్టాడు. ఏ బంతులైతే స్ట్రెయిట్ బ్యాట్ తో ఆడితే ఇబ్బంది ఎదురవుతుందో.. ఆ బంతులను రివర్స్ స్విప్ లతో ఈజీగా ఆడాడు. దాంతో ఫీల్డింగ్ ను కూడా ఛేదించాడు. రన్స్ ఈజీగా వచ్చాయి. అలా రివర్స్ షాట్లు ఆడుతుండటంతో మన బౌలర్లు కూడా ఏ బంతులు వేయాలో తికమకపడ్డారు. పోప్.. ఇలా 40 శాతం బంతులను రివర్స్ స్విప్ ఆడటం వల్లనే సర్వైవ్ కాగలిగాడు. ఈ ఒక్క ఐడియాతో ఇప్పుడు టీమిండియా విజయానికి పోప్ అడ్డుగోడలా నిలబడిపోయాడు. జట్టులో మరే బ్యాటర్ కూడా కనీసం హాఫ్ సెంచరీ చేయలేని చోట పోప్ ఏకంగా సెంచరీ బాదేశాడు.
208 బంతుల్లో 17 ఫోర్లతో 148 పరుగులు చేసి.. నాటౌట్ గా నిలిచి.. మూడో రోజు ఆటను ముగించాడు. నిజానికి ఈ రోజే మ్యాచ్ ముగిద్దాం అనుకున్న టీమిండియాకు సవాల్ విసిరి నిలిచాడు. మూడో రోజు ఆటముగిసే సమయానికి ఇంగ్లండ్ 6 వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసి.. 126 పరుగుల లీడ్ సాధించింది. ఇక నాలుగో రోజు కూడా పోప్ ఇదే విధంగా బ్యాటింగ్ కొనసాగించాడు. మొత్తం 278 బంతుల్లో 21 పోర్లతో 196 పరుగులు చేశాడు. ఎట్టకేలకు బుమ్రా పోప్ డబుల్ సెంచరీని అడ్డుకోబట్టి సరిపోయింది. లేదంటే స్కోర్ కార్డు పరుగులు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. టీమిండియా ముందు మంచి ఫైటింగ్ టోటల్ ఉండటానికి పోప్ విధ్వంసమే కారణం. సులువుగా వస్తుందనుకున్న విజయం.. పోప్ పోరాటం కారణంగా టీమిండియా బ్యాటర్లు చెమట చిందాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తానికి మరి జట్టు మొత్తం చేతులెత్తేసిన చోట.. పోప్ పోరాటంపై, అలాగే ఇంగ్లండ్ మొత్తాన్ని అవుట్ చేసిన భారత ఆటగాళ్లు పోప్ ఒక్కడిని అవుట్ చేయలేకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
His first competitive match for 7 months following injury 💪
An innings of genius, invention and bravery 🏏
That was so special, @OPope32 👏 pic.twitter.com/fxMYNnhVgg
— England Cricket (@englandcricket) January 28, 2024
A lot of love from the lads for that @OPope32 innings! 😍 👏
Match Centre: https://t.co/s4XwqqpNlL
🇮🇳 #INDvENG 🏴 | #EnglandCricket pic.twitter.com/67wp5U1ea5
— England Cricket (@englandcricket) January 27, 2024