SNP
ప్రస్తుతం టీమిండియా ఫోకస్ మొత్తం వరల్డ్ కప్ గెలవడం పైనే ఉంది. అందుకు తగ్గట్లే జట్టులోని ఆటగాళ్లంతా అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పటికే 5 విజయాలతో మంచి జోరుమీదుంది టీమిండియా. అయితే ఈ వరల్డ్ కప్ తర్వాత జట్టులో పెను తుపాన్ సంభవించే ప్రమాదం ఉంది. అందేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రస్తుతం టీమిండియా ఫోకస్ మొత్తం వరల్డ్ కప్ గెలవడం పైనే ఉంది. అందుకు తగ్గట్లే జట్టులోని ఆటగాళ్లంతా అద్భుతంగా ఆడుతున్నాడు. ఇప్పటికే 5 విజయాలతో మంచి జోరుమీదుంది టీమిండియా. అయితే ఈ వరల్డ్ కప్ తర్వాత జట్టులో పెను తుపాన్ సంభవించే ప్రమాదం ఉంది. అందేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా ఉంది రోహిత్ సేన. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలతో అదరగొట్టింది. ఆస్ట్రేలియా, పాకిస్థాన్, న్యూజిలాండ్ లాంటి పెద్ద టీమ్స్‌తో పాటు ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లును మట్టికరిపించి.. 10 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మంచి పొజిషన్‌లో ఉంది. ప్రస్తుతం టీమిండియా ఆడుతున్న విధానం చూస్తుంటే.. మూడో సారి భారత్ విశ్వవిజేతగా నిలుస్తుందనే నమ్మకం అభిమానుల్లో అంతకంతకు పెరిగిపోతుంది. అదే జరిగితే సగటు క్రికెట్ అభిమానికి అంతకంటే ఏం కావాలి. అయితే.. వరల్డ్ కప్ తర్వాత టీమిండియాలో చోటు చేసుకునే కొన్ని పరిణామాలు ఇప్పటి నుంచే క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది.
ప్రపంచ ఛాంపియన్‌గా అవతరించినా, చివరి మ్యాచ్‌ల్లో ఓడినా కూడా.. వరల్డ్ కప్ తర్వాత టీమిండియా పెను సంచలనాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరల్డ్ కప్ ముగిసిన వెంటనే.. ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆపై 2024 వన్డే వరల్డ్ కప్ ఉండటంతో.. టీమిండియాలో ఊహించని పెను తుపాన్ వచ్చూ సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. ఈ వరల్డ్ కప్ తర్వాత.. 2024లో వెస్టిండీస్, యూఎస్‌ఏ సంయుక్త వేదికలో టీ20 వరల్డ్ కప్ నిర్వహించనున్నారు. దీంతో.. ఈ వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా పెద్దగా వన్డేలు ఆడదు. టీ20లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టనుంది. మరి ప్రస్తుతం వన్డే టీమ్‌లో ఉన్నా చాలా మంది క్రికెటర్లను టీ20లు ఆడిస్తారా? లేదా? అన్నది అనుమానం.
ఎందుకంటే.. టీ20 వరల్డ్ కప్ 2022 తర్వాత రోహిత్ శర, విరాట్ కోహ్లీలను టీ20లకు దూరంగా ఉంచారు. మరి రానున్న టీ20 వరల్డ్ కప్‌లో వారిని కొనసాగిస్తారా? లేక యువ జట్టుతో వెళ్తారా? అన్నది చూడాలి. రానున్న టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మ ఆడకపోతే.. దాదాపు అతని కెరీర్ ముగిసినట్లే. ఎలాగో హార్దిక్ పాండ్యాను అన్‌అఫీషియల్ టీ20 కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఈ వరల్డ్ కపే రోహిత్ శర్మకు చివరి వరల్డ్ కప్ అనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అతన్ని టీ20లకు పెడితే.. అది పెద్ద సహసమే అవుతుంది. ఎందుకంటే ప్రస్తుతం రోహిత్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. పైగా టీ20 స్టైల్లోనే ఆడుతున్నాడు. అలాగే కోహ్లీ కూడా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. వీరిద్దరిని కాదని, యువ జట్టుతో టీ20 వరల్డ్ కప్‌కు బీసీసీఐ వెళ్లాలని భావిస్తే.. పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
ఇక శ్రేయస్ అయ్యర్‌ను వన్డేలకే కొనసాగిస్తారా? లేక టీ20ల్లో కూడా కొనసాగిస్తారన్నది కూడా అనుమానమే. అలాగే టీమిండియా బౌలర్ల గురించి మాట్లాడుకుంటే.. మొహమ్మద్ షమీ, మొహమ్మద్ సిరాజ్‌లను కూడా వన్డేలకు పరిమితం చేస్తారా? లేక టీ20ల్లో ఆడిస్తారా? అనేది చూడాలి. ఎందుకంటే.. టీ20 వరల్డ్ కప్ 2022లో సిరాజ్‌ను పక్కనపెట్టారు. భుమీ, అర్షదీప్ సింగ్ లాంటి బౌలర్లపై ఆధారపడ్డారు. వారి వైఫ్యలం సిరాజ్, బుమ్రా లేకపోవడం టీమిండియా విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపించింది. మరి ప్రస్తుతం టీమిండియా పేస్ ఎటాక్ ఎంతో పటిష్టంగా ఉంది. బుమ్రా, సిరాజ్, షమీ జోడీని విడదీస్తే.. బీసీసీఐ పెద్ద తప్పు చేసినట్లే అవుతుంది. కానీ, టీ20ల కోసం బీసీసీఐ ప్లాన్స్ వేరేలా ఉండటం టీమిండియాలో పెను మార్పులు సంభించినా ఆశ్చర్యపోవాల్సి పనిలేదు.
ఇక అన్నింటికంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది.. కెప్టెన్, కోచ్ గురించి. ఈ వరల్డ్ కప్‌తో హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగుస్తుంది. దీంతో ద్రవిడ్‌ను మళ్లీ కొనసాగిస్తారా? లేక ఇంటికి పంపిస్తారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ద్రవిడ్ స్థానంలో మరో టీమిండియా దిగ్గజ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను టీమిండియా హెడ్ కోచ్‌గా నియమిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక అలాగే టీమిండియా కెప్టెన్ రోహత్ శర్మ కప్పు గెలస్తే ఒకే.. లేదంటే.. అతని స్థానానికి కూడా ముప్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టీ20లకు పాండ్యా కెప్టెన్‌గా ఉన్నాడు. మరి వరల్డ్ కప్ తర్వాత రోహిత్ కెప్టెన్సీ ఉంటుందా? ఊడుతుందా? చూడాలి. ఇలా ఈ వన్డే వరల్డ్ కప్ తర్వాత.. టీమిండియాలో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఒక వేళ టీమిండియా కప్పు కొడితే.. టీ20 వరల్డ్ కప్ 2024కు కూడా ఇదే టీమ్‌తో వెళ్లిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అయితే.. ఆ వరల్డ్ కప్ ఆరంభానికి ముందు ఐపీఎల్ 2024 సీజన్ ఉండటం, ఆటగాళ్ల ఫిట్‌నెస్, గాయాలు, ఫామ్ కూడా పరిగణంలోకి రానుంది. మరి వరల్డ్ కప్ తర్వాత టీమిండియా ఎలాంటి మార్పులు వస్తాయని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
INDIAN TEAM PROMO FOR WORLD CUP….!!
– This is Goosebumps 🇮🇳pic.twitter.com/0HfzPJMhBk
— Johns. (@CricCrazyJohns) October 28, 2023