BCCIపై ఆధిపత్యం కోసం జైషా బిగ్ స్కెచ్.. ICCనే వాడుకుంటున్నాడు!

Jay Shah: భారత క్రికెట్ బోర్డులో సెక్రెటరీ జైషా చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. అలాంటి ఆయన బోర్డుపై పూర్తి ఆధిపత్యం కోసం బిగ్ స్కెచ్ వేసినట్లు సమాచారం.

Jay Shah: భారత క్రికెట్ బోర్డులో సెక్రెటరీ జైషా చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. అలాంటి ఆయన బోర్డుపై పూర్తి ఆధిపత్యం కోసం బిగ్ స్కెచ్ వేసినట్లు సమాచారం.

భారత క్రికెట్​ బోర్డులో సెక్రెటరీ జైషా చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నాళ్లుగా బోర్డులో ఆయన హవా నడుస్తోంది. ప్రెసిడెంట్​గా ఎవరున్నా జైషా డామినేషన్ మాత్రం బలంగా ఉంది. ఇందుకు ఎన్నో విషయాలు ఎగ్జాంపుల్​గా చెబుతున్నారు ఎక్స్​పర్ట్స్. బీసీసీఐ నిర్వహించే కార్యక్రమాల్లో ఆయనే సెంటరాఫ్ అట్రాక్షన్​గా నిలవడం, ఆటగాళ్లు కూడా ఆయన గురించి స్పెషల్​గా చెప్పడం, మ్యాచ్​ల టైమ్​లోనూ ఆయనే హల్​చల్​​ చేయడాన్ని ఉదాహరణగా చెబుతున్నారు. బోర్డు నిర్ణయాల్లో ఆయన ఎంత చెబితే అంత అనే టాక్ కూడా నడుస్తోంది. అయినా ఆయన అంత హ్యాపీగా లేడట. బోర్డు సెక్రెటరీగా ఉన్న జైషా.. బీసీసీఐ మీద పూర్తి ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

భారత క్రికెట్ బోర్డుకు ప్రెసిడెంట్​ అవ్వాలనేది జైషా డ్రీమ్ అని సమాచారం. అందుకోసం ఆయన భారీ స్కెచ్​ను రెడీ చేశాడని వినిపిస్తోంది. ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసే అర్హత సంపాదించేందుకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ను వాడుకోవాలని చూస్తున్నాడట. అందులో భాగంగానే తొలుత ఐసీసీ ఛైర్మన్ పదవిని అధిష్టించాలని జైషా పకడ్బందీగా వ్యూహాలు పన్నుతున్నాడని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఒకవేళ ఐసీసీ ఛైర్మన్ పోస్ట్ దక్కితే అందులో మూడేళ్ల పాటు కొనసాగితే చాలు.. అప్పుడు బీసీసీఐ ప్రెసిడెంట్ పదవికి పోటీ చేయొచ్చనేది ఆయన ప్లాన్ అని తెలుస్తోంది. ఐసీసీ ఛైర్మన్​గా పని చేసిన వారికి బీసీసీఐ ప్రెసిడెంట్ పోస్ట్​కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లభిస్తుంది. అందుకే ఐసీసీని వాడుకోవాలని ఆయన డిసైడ్ అయినట్లు టాక్ నడుస్తోంది.

ఆల్రెడీ బీసీసీఐలో తన హవా నడుస్తున్నా.. అఫీషియల్​గా ఫుల్ పవర్స్ దక్కించుకోవాలంటే ప్రెసిడెంట్ పదవిని అధిష్టించడమే మార్గమని షా భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే తొలుత ఐసీసీలో సేవలు అందించి, ఆ తర్వాత బీసీసీఐ బాస్​గా మరింత డామినేషన్ చూపించాలని ఆయన అనుకుంటున్నట్లు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. టీ20 వరల్డ్ కప్​ను టీమిండియా గెలుచుకోవడంపై జైషా హర్షం వ్యక్తం చేశాడు. కప్‌ డ్రీమ్ నెరవేరినందుకు ఫుల్ హ్యాపీగా ఉందన్నాడు. ఇదే జోరులో ఛాంపియన్స్ ట్రోఫీ-2025ను కూడా భారత్ గెలుచుకోవాలని తెలిపాడు. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆ కల కూడా సాకారం అవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నాడు జైషా. మరి.. బీసీసీఐ ప్రెసిడెంట్ పదవి కోసం జైషా ఐసీసీని వాడుకుంటున్నాడనే అభిప్రాయాలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments