James Anderson: పేస్ బౌలింగ్​కే వన్నె తెచ్చిన అండర్సన్ రిటైర్మెంట్.. ఆ మ్యాచ్​తో క్రికెట్​కు గుడ్​బై!

పేస్ బౌలింగ్​కు క్రేజ్ తీసుకొచ్చిన ఈతరం దిగ్గజం జేమ్స్ అండర్సన్​ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ మ్యాచ్​తో ఆట నుంచి తాను తప్పుకోనున్నట్లు వెల్లడించాడు.

పేస్ బౌలింగ్​కు క్రేజ్ తీసుకొచ్చిన ఈతరం దిగ్గజం జేమ్స్ అండర్సన్​ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆ మ్యాచ్​తో ఆట నుంచి తాను తప్పుకోనున్నట్లు వెల్లడించాడు.

క్రికెట్​ ఇప్పుడు బ్యాటర్స్ గేమ్​గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ జెంటిల్మన్ గేమ్​లో బ్యాట్స్​మెన్​దే హవా. వాళ్లకు ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్, క్రేజ్, స్టార్​డమ్ ఇతర ఆటగాళ్లకు ఉండదు. బ్యాట్స్​మెన్ సాధించిన రికార్డుల గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఎండార్స్​మెంట్లు కూడా వారికే ఎక్కువగా అందుతాయి. అందుకే ఆదాయంలోనూ బ్యాటర్లే ముందంజలో ఉంటారు. అయితే ప్రతి తరంలోనూ కొందరు అద్భుత బౌలర్లు వస్తారు. బ్యాటర్లకు సవాళ్లు విసురుతూ ఆటను మరింత రక్తికట్టిస్తారు. వాళ్లను ఎదుర్కోవాలంటేనే అందరూ వణుకుతారు. అలా ఈ జనరేషన్ చూసిన బెస్ట్ బౌలర్స్​లో ఒకడు జేమ్స్ అండర్సన్. 22 ఏళ్లుగా అందర్నీ అలరించిన ఈ పేస్ బౌలింగ్ లెజెండ్ రిటైర్మెంట్ ప్రకటించాడు.

పర్ఫెక్ట్ లైన్ అండ్ లెంగ్త్​లో అద్భుతమైన యార్కర్స్, కళ్లుచెదిరే ఇన్​స్వింగర్స్, కవ్వించే కట్టర్స్, మైండ్​బ్లాంక్ చేసే బౌన్సర్స్​ సంధిస్తూ పేస్ బౌలింగ్​కే వన్నె తెచ్చాడు అండర్సన్. 2002లో ఆడటం మొదలుపెట్టిన ఈ పేసర్ ఇప్పటిదాకా 187 టెస్టుల్లో ఏకంగా 700 వికెట్లు పడగొట్టాడు. 41 ఏళ్ల అండర్సన్ వన్డేల్లో 269 వికెట్లు తీశాడు. పేస్ బౌలింగ్​కే వన్నె తెచ్చిన ఈ దిగ్గజం టీమ్​లో ఉన్నాడంటే అపోజిషన్ బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టాల్సిందే. సచిన్ టెండూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ వరకు తోపు బ్యాటర్లను కూడా తన బౌలింగ్​తో భయపెట్టాడు అండర్సన్. స్వదేశంలో అతడ్ని ఎదుర్కోవడం ఎంతటి బ్యాటర్​కైనా కత్తి మీద సాము లాంటిదే.

ఇటీవల టీమిండియాతో జరిగిన టెస్ట్ సిరీస్​లో 700 వికెట్ల క్లబ్​లోకి చేరాడు అండర్సన్. అతడు ఫిట్​గా ఉన్నాడు. బౌలింగ్​లో కూడా ఇంకా పస తగ్గలేదు. దీంతో మరిన్ని టెస్టులు ఆడతాడని అంతా భావించారు. కానీ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడీ ఇంగ్లండ్ లెజెండ్. లార్డ్స్​లో కెరీర్ స్టార్ట్ చేసిన అండర్సన్.. అదే స్టేడియంలో జులై 10 నుంచి వెస్టిండీస్​తో జరిగే టెస్టుతో క్రికెట్​కు గుడ్​బై చెప్పనున్నాడు. ఇక మీదట ఇంగ్లండ్​ తరఫున బరిలోకి దిగబోననే విషయాన్ని తట్టుకోవడం కష్టంగా ఉందని.. కానీ రిటైర్మెంట్​కు ఇదే కరెక్ట్ టైమ్ అని అండర్సన్ తెలిపాడు. తన భార్య, తల్లిదండ్రుల సపోర్ట్ లేకుండా ఇదంతా సాధించేవాడ్ని కాదని అన్నాడు. ఇన్నేళ్ల కెరీర్​లో తనకు సహకరించిన అభిమానులకు, తోటి ఆటగాళ్లకు, ఇంగ్లండ్ బోర్డుకు అతడు థ్యాంక్స్ చెప్పాడు.

Show comments