IND vs ENG Shubman Gill Superb Catch: వీడియో: గిల్ సూపర్ క్యాచ్.. మెరుపు వేగంతో పెరిగెడుతూ..!

వీడియో: గిల్ సూపర్ క్యాచ్.. మెరుపు వేగంతో పరిగెడుతూ..!

ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టులో భారత బ్యాటర్ శుబ్​మన్ గిల్ ఓ అద్భుతమైన క్యాచ్​తో అదరగొట్టాడు. ఇది చాలా స్పెషల్ క్యాచ్.

ధర్మశాలలో జరుగుతున్న ఐదో టెస్టులో భారత బ్యాటర్ శుబ్​మన్ గిల్ ఓ అద్భుతమైన క్యాచ్​తో అదరగొట్టాడు. ఇది చాలా స్పెషల్ క్యాచ్.

భారత్-ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. రెండు జట్లు నువ్వా? నేనా? అంటూ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్​లో టాస్ నెగ్గిన ప్రత్యర్థి జట్టు సారథి బెన్ స్టోక్స్ తొలుత బ్యాటింగ్​ సెలక్ట్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్​లో రోహిత్ సేన కేవలం ఒకే ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయంతో బాధపడుతున్న యంగ్ బ్యాటర్ రజత్ పాటిదార్ ప్లేసులోకి దేవ్​దత్ పడిక్కల్​ను తీసుకొచ్చింది. అతడికి ఇది అరంగేట్ర మ్యాచ్ కావడం విశేషం. ఇక, బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లీష్ టీమ్​కు సూపర్బ్ స్టార్ట్ దొరికింది. ఆ జట్టు ఓపెనర్లు చెలరేగడంతో వికెట్ కోల్పోకుండా 50 పరుగుల మార్క్​ను దాటేసింది. కానీ శుబ్​మన్ గిల్ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో ఇంగ్లండ్​ తొలి వికెట్​ను కోల్పోయింది.

జాక్ క్రాలే (61 నాటౌట్), బెన్ డకెట్ (27) ఇంగ్లీష్ టీమ్​కు మంచి స్టార్ట్ అందించారు. అయితే వీరి పార్ట్​నర్​షిప్ మరింత డేంజరస్​గా​ మారుతున్న టైమ్​లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్​లో షాట్​కు ప్రయత్నించాడు డకెట్. ఆఫ్ సైడ్ కొట్టిన బాల్ సరిగ్గా టైమ్ అవ్వలేదు. దీంతో అది బాగా పైకి లేచింది. దాన్ని గమనించిన గిల్ మెరుపు వేగంతో వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి డైవ్ కొట్టి క్యాచ్ అందుకున్నాడు. క్రికెట్​లో బ్యాక్ రన్నింగ్ క్యాచెస్ పట్టుకోవడం చాలా కష్టం. కానీ గిల్ మాత్రం అసాధారణ క్యాచ్​ను కూడా అలవోకగా పట్టేశాడు. అతడు లేట్​గా రియాక్ట్ అయ్యాడు. కానీ ఒక్కసారి బాల్​ను చేరుకోగలననే ధీమా రాగానే.. పరిగెత్తుకుంటూ వెళ్లి దూకి పట్టేశాడు. అతడి క్యాచ్ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి.. గిల్ రన్నింగ్ క్యాచ్​ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్‌-ఇంగ్లండ్‌ చివరి టెస్ట్‌.. కన్నీళ్లు పెట్టుకున్న క్రికెటర్‌!

Show comments