Nidhan
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రివేంజ్ తీర్చుకున్నాడు. దీన్ని చూసిన అభిమానులు ఇది కదా మనకు కావాల్సింది అంటున్నారు.
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై భారత స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ రివేంజ్ తీర్చుకున్నాడు. దీన్ని చూసిన అభిమానులు ఇది కదా మనకు కావాల్సింది అంటున్నారు.
Nidhan
క్రికెట్లో రివేంజ్లు మామూలే. బ్యాటర్లు, బౌలర్ల మధ్య వార్స్ నడుస్తుంటాయి. తనను ఔట్ చేశాడని.. అతడి బౌలింగ్‌లో చెలరేగి ఆడేందుకు బ్యాట్స్‌మెన్ ప్రయత్నిస్తుంటారు. తమ బౌలింగ్‌లో పరుగులు పిండుకున్నాడు కాబట్టి అతడ్ని ఎలాగైనా ఔట్ చేయాలని బౌలర్లు శ్రమిస్తుంటారు. అలా ఆటగాళ్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం అనేది సాధారణమనే చెప్పాలి. అయితే ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో మాత్రం ఇద్దరు బ్యాటర్ల మధ్య చిన్న వార్ నడిచింది. ఇంగ్లీష్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు, భారత స్టైలిష్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు నడుమ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ జరిగింది. అయితే ఎట్టకేలకు ఇందులో అయ్యర్‌దే పైచేయి అయింది. టీమిండియా బ్యాటర్ తన రివేంజ్‌ను తీర్చుకున్నాడు. దీంతో అభిమానులు ఇది కదా కావాల్సింది అని అంటున్నారు. అసలు అయ్యర్-స్టోక్స్ మధ్య ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో శ్రేయస్ అయ్యర్ (29), శుబ్‌మన్ గిల్ (104) బ్యాటింగ్ చేస్తున్నారు. అప్పటికే వాళ్లిద్దరూ కలసి మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. దీంతో ఈ జోడీని విడదీసేందుకు స్పిన్నర్ టామ్ హార్ట్లీని రంగంలోకి దించాడు ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్. ఈ ప్లాన్ వర్కౌట్ అయి అయ్యర్ ఔటయ్యాడు. అతడు కొట్టిన బాల్ ఆఫ్ సైడ్ గాల్లోకి లేవగా స్టోక్స్ వెనుక వైపు పరిగెత్తుకుంటూ వెళ్లి అద్భుతంగా క్యాచ్‌ను ఒడిసి పట్టుకున్నాడు. అయితే క్యాచ్ పట్టాక ఆడియెన్స్ వైపు తన వేలిని చూపిస్తూ అసభ్యంగా సంజ్ఞ చేశాడు. దీన్ని గుర్తుపెట్టుకున్న అయ్యర్ ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో బదులు తీర్చుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో బెన్ ఫోక్స్ (36) ఓ బాల్‌ను లెగ్ గల్లీలోకి కొట్టాడు. అటు ఫీల్డర్ లేకపోవడంతో సింగిల్ కోసం ప్రయత్నించాడు.
రన్ తీయాలా? వద్దా? అనే దానిపై స్టోక్స్, ఫోక్స్‌కు కన్ఫ్యూజర్ ఏర్పడింది. అయితే ఫోక్స్ నాన్‌స్ట్రయికర్ ఎండ్ వైపు వెళ్లిపోవడంతో స్టోక్స్ స్ట్రయికింగ్ సైడ్ పరుగులు తీశాడు. ఈ గ్యాప్‌లో స్క్వేర్ లెగ్‌లో ఉన్న అయ్యర్ పరిగెత్తుకుంటూ వచ్చి బాల్‌ను తీసుకొని నేరుగా వికెట్లకేసి కొట్టాడు. క్రీజుకు ఇంచు దూరంలో స్టోక్స్ ఉండగా బాల్ వికెట్లను గిరాటేసింది. రనౌట్ కావడంతో అతడు నిరాశగా పెవిలియన్ వైపు చేసుకున్నాడు. అంతే భారత జట్టు మొత్తం సంబరాలు చేసుకుంది. తాను ఔట్ అయినప్పుడు ఎలాగైతే స్టోక్స్ వేలు చూపించాడో అయ్యర్ కూడా అలాగే సంజ్ఞ చేస్తూ స్టోక్స్‌కు బైబై చెప్పాడు. ఇదే మ్యాచ్‌లో తన రివేంజ్ తీర్చుకున్నాడు. ఈ వీడియో చూసిన అభిమానులు ఇది కదా కావాల్సింది అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అగ్రెషన్, ఫైర్‌ను ఫీల్డింగ్‌తో పాటు బ్యాటింగ్‌లోనూ చూపించాలని సూచిస్తున్నారు. బ్యాట్‌తో కూడా రాణిస్తే టీమ్‌లో శ్రేయస్ ప్లేసు ఫిక్స్ అవుతుందని చెబుతున్నారు. మరి.. అయ్యర్-స్టోక్స్ వార్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
What a throw by Shreyas Iyer. 🔥🫡pic.twitter.com/saweZmuMhP
— Johns. (@CricCrazyJohns) February 5, 2024
Ben Stokes after taking Shreyas Iyer’s catch.
Shreyas Iyer after running out Ben Stokes. pic.twitter.com/xpp8lF6N62
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 5, 2024