Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోమారు పరువు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్ పోరులో కింగ్ టోటల్ ఫెయిలయ్యాడు.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోమారు పరువు తీసుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్ పోరులో కింగ్ టోటల్ ఫెయిలయ్యాడు.
Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎప్పుడూ థర్డ్ డౌన్లోనే బ్యాటింగ్‌కు దిగుతుంటాడు. కెరీర్ మొదట్నుంచి అతడు ఇదే స్థానంలో ఆడుతూ వస్తున్నాడు. ఫస్ట్ డౌన్లో వచ్చి టన్నుల కొద్దీ పరుగులు చేశాడు. లెక్కలేనన్ని రికార్డులు క్రియేట్ చేశాడు. అలాంటోడు కీలకమైన టీ20 వరల్డ్ కప్-2024లో ఓపెనింగ్‌లో ఆడుతున్నాడు. అయితే ఓపెనర్‌గా వచ్చి అతడు పెద్దగా ఏమీ సాధించలేదు. గ్రూప్ స్టేజ్ మ్యాచెస్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. యూఎస్ఏతో మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. అయితే సూపర్-8లో 24, 37 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. కానీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న సూపర్ పోరులో మాత్రం అతడు పరువు తీసుకున్నాడు.
ఆసీస్‌తో మ్యాచ్‌లో మంచి ఇన్నింగ్స్ ఆడి ఫామ్‌లోకి వస్తాడనుకుంటే మళ్లీ ఫ్లాప్ అయ్యాడు విరాట్. 5 బంతులు ఎదుర్కొన్న ఈ టాప్ బ్యాటర్.. డకౌట్ అయ్యాడు. జోష్ హేజల్‌వుడ్ బౌలింగ్‌ను సరిగ్గా అర్థం చేసుకోలేక చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. కోహ్లీ ఔట్ అయిన ఇదే పిచ్ మీద రోహిత్ భారీ షాట్లు బాదుతున్నాడు. వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంది. అయినా కోహ్లీ రన్స్ చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఇది చూసిన నెటిజన్స్ ఇలా పరువు తీసుకోవడం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. కింగ్‌ను ఓపెనర్‌గా ఆడించాలనేది అత్యాశ అని.. అతడు కూడా అదే కోరుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. అత్యాశకు ఇప్పుడు ఫలితం అనుభవించక తప్పదని చెబుతున్నారు. మరి.. కోహ్లీ మరోమారు డకౌట్ అవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Virat Kohli dismissed for a 5 ball duck. pic.twitter.com/JnaSQh8w9y
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 24, 2024