IND vs SL- SuryaKumar Yadav Captain Innings: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. లంక బౌలర్లకు చెమటలు పట్టించాడు!

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. లంక బౌలర్లకు చెమటలు పట్టించాడు!

IND vs SL- SuryaKumar Yadav Captain Innings: శ్రీలంకపై టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లంక బౌలర్లను నిర్దాక్షిణ్యంగా దండించాడు. ఎవరినీ వదలకుండా ఇచ్చిపడేశాడు.

IND vs SL- SuryaKumar Yadav Captain Innings: శ్రీలంకపై టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముఖ్యంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లంక బౌలర్లను నిర్దాక్షిణ్యంగా దండించాడు. ఎవరినీ వదలకుండా ఇచ్చిపడేశాడు.

టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక 2024లో తొలి టీ20లో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంక మొదటి నుంచి టీమిండియా బ్యాటర్లను కట్టడి చేయడంలో తడబడుతూనే ఉంది. 74 పరుగుల వరకు ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయింది. 6వ ఓవర్ ఆఖరి బంతికి శుభ్ మన్ గిల్(34)ను దిల్ షాన్ మదుషనాకా అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికే యశస్వీ జైస్వాల్(40)ను హసరంగా పెవిలిన్ కు పంపారు. అయితే అప్పుడు కాస్త టీమిండియా అభిమానులు కంగారు పడ్డారు. శ్రీలంక హోమ్ టౌన్ కావడం.. వాళ్లు కాస్త పట్టు సాధిస్తున్నట్లు అనిపించింది. కానీ, మ్యాచ్ స్వరూపాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మార్చేశాడు. తన బ్యాటుతో లంక బౌలర్లను కంగారు పెట్టేశాడు.

కెప్టెన్ ఇన్నింగ్స్:

వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో టీమిండియా కాస్త నెమ్మదిగా ఆడుతుందని అంతా భావించారు. ముఖ్యంగా శ్రీలంక బౌలర్లు బ్యాటర్లు కాస్త తగ్గుతారు అనుకున్నారు. కానీ, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఒక్క బంతిని కూడా వదలకుండా విజృంభించాడు. ఏ బౌలర్ పై కూడా కనికరం చూపించలేదు. వచ్చిన బంతిని వచ్చినట్లు బాదేస్తున్నాడు. తన 360 డిగ్రీస్ ఆటతో టీమిండియా ఫ్యాన్స్ కి మంచి ఫుల్ మీల్స్ పెట్టేశాడు. సూర్యకుమార్ యాదవ్ మైదానంలో విజృంభిస్తుంటే.. హెడ్ కోచ్ గంభీర్ కూడా అలా చూస్తుండి పోయాడు. స్కై వరుస బౌండిరీలతో చెలరేగుతుంటే గంభీర్ వావ్ అనేలా కళ్లప్పగించి చూశాడు.

సూర్యకుమార్ యాదవ్ ఈ ఇన్నింగ్స్ లో ఏకంగా 22 బంతుల్లోనే తన టీ20 కెరీర్లో 20వ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. మొత్తం 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 58 పరుగులు నమోదు చేశాడు. కాస్త తడపడుతుంది అనుకున్న సమయంలో సూర్యకుమార్ ఆడిన ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కెప్టెన్ అయ్యాడు కదా.. కాస్త చూసి ఆడతాడు అనుకున్నారు. కానీ, కెప్టెన్ అయ్యాకే ఇంకా అగ్రెసివ్ గా కనిపించాడు. ఈ ఇన్నింగ్స్ తో శ్రీలంక మీద టీ20ల్లో తన కెరీర్లో రెండో అత్యధిక స్కోర్ ని నమోదు చేశాడు. అటు పంత్ మాత్రం స్కైకి అవకాశాలు ఇస్తూ.. తాను మాత్రం డిఫెండ్ చేస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ తర్వాత బ్యాటింగ్ కి హార్దిక్ పాండ్యా వచ్చాడు. ఇప్పుడు లంక బౌలర్లను పంత్, పాండ్యాలు ఆడేసుకుంటున్నారు. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments