Rohit-Pandya: హార్దిక్ పాండ్యా అత్యాశ.. రోహిత్ ముందా ఈ పిల్ల ఆటలు! దెబ్బ అదుర్స్!

హార్దిక్ పాండ్యా అత్యాశతో ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపడితే.. రోహిత్ శర్మ అతడికి బిగ్ షాకిస్తూ.. మరోదెబ్బ కొట్టడానికి సిద్దంగా ఉన్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యా అత్యాశతో ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపడితే.. రోహిత్ శర్మ అతడికి బిగ్ షాకిస్తూ.. మరోదెబ్బ కొట్టడానికి సిద్దంగా ఉన్నాడు. ఆ వివరాల్లోకి వెళితే..

‘తాడి తన్నేవాడుంటే.. వాడి తల తన్నే వాడు ఉంటాడు’ అన్న సామెత మనందరికి తెలిసిందే. ఇక ఇది ఎన్నో విషయాల్లో రుజువైంది కూడా. ప్రస్తుతం అచ్చంగా ఇదే సామెత రోహిత్ శర్మ-హార్దిక్ పాండ్యా విషయంలో నిజమైంది. ఎందుకంటే? ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను కాదని, గుజరాత్ టైటాన్స్ నుంచి వచ్చిన హార్దిక్ పాండ్యాకు సారథ్య పగ్గాలు అప్పగించారు. అప్పటి నుంచి రోహిత్ అసంతృప్తిలో ఉంటూ వస్తున్నాయి. కెప్టెన్ పదవి ఇస్తేనే ముంబై లోకి వస్తాను అంటూ అత్యాశతో కండిషన్ పెట్టాడు పాండ్యా. ఇక ఆ తర్వాత జరిగిన తతంగం మెుత్తం మనకు తెలియనిది కాదు. అయితే రోహిత్ శర్మ ఊహించని షాక్ ఇచ్చాడు పాండ్యాకు. అక్కడ ముంబై కెప్టెన్సీ పోతే.. ఇక్కడ పాండ్యా నుంచి టీమిండియా పగ్గాలను లాక్కుంటున్నాడు. దీంతో రోహిత్ ముందా పిల్ల బచ్చా ఆటలు అంటూ నెటిజన్లు, రోహిత్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆఫ్గానిస్తాన్ తో జరిగే టీ20 సిరీస్ తో పాటుగా నెక్ట్స్ జరిగే టీ20 వరల్డ్ కప్ కు సైతం రోహిత్ శర్మ అందుబాటులో ఉంటాడని తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించి బీసీసీఐ కూడా ఇప్పటికే రోహిత్ శర్మతో మంతనాలు జరిపినట్లు సమాచారం. ఆఫ్గాన్ తో టీ20 సిరీస్ తో పాటుగా వచ్చే పొట్టి వరల్డ్ కప్ కు రోహిత్ నే కెప్టెన్ గా కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోందట. ఇక ఈ విషయంపై రోహిత్ కూడా సానుకూలంగా ఉన్నాడని సమాచారం. అదీకాక 2022 నుంచి టీ20లకు పాండ్యా కెప్టెన్ గా ఉంటూ వస్తున్నాడు. కానీ ప్రస్తుతం అతడు గాయపడటం, దాని నుంచి ఇంకా కోలుకోకపోవడంతో.. రోహిత్ కే పొట్టి ఫార్మాట్ పగ్గాలు దక్కనున్నాయి. దీంతో 2024 టీ20 వరల్డ్ కప్ మెగాటోర్నీకి కెప్టెన్ గా ఉంటాను అని కలలు కన్న పాండ్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలేలా ఉంది.

ఈ క్రమంలోనే గత కొంతకాలంగా టీ20 ఫార్మాట్ కు దూరంగా ఉంటూ వస్తున్న విరాట్ కోహ్లీ, రోహిత్ లు టీ20ల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. కెప్టెన్సీలో అపార అనుభవం ఉన్న హిట్ మ్యాన్ కే పగ్గాలు ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో ముంబై కెప్టెన్ పగ్గాలు తన నుంచి లాక్కున్న పాండ్యాకు అదిరిపోయే దెబ్బ కొట్టాడు రోహిత్. పాండ్యా అత్యశకుపోయి.. ఇటు ఐపీఎల్ లో, అటు ఇండియా కెప్టెన్ గా ఉండాలని కలలు కన్న స్టార్ ఆల్ రౌండర్ కు భారీ షాక్ తగలనుంది. ఇక ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ రోహిత్ ముందా నీ పిల్లబచ్చా ఆటలు, ఇదీ కిక్ అంటే.. అంటూ పాండ్యాను ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments