SNP
Hardik Pandya, IND vs ENG, Semi Final, T20 World Cup 2024: టీమిండియా వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో కొట్టిన సిక్సులు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. వాటి గురించి మరిన్ని విషయాలు ఇలా ఉన్నాయి..
Hardik Pandya, IND vs ENG, Semi Final, T20 World Cup 2024: టీమిండియా వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా.. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో కొట్టిన సిక్సులు మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచాయి. వాటి గురించి మరిన్ని విషయాలు ఇలా ఉన్నాయి..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. గురువారం గయానాలో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి.. సౌతాఫ్రికాతో అమీతుమీ తేల్చుకునేందుకు ఫైనల్‌కు దూసుకెళ్లింది. శనివారం ఇండియా, సౌతాఫ్రికా మధ్య టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి రెండో టీ20 వరల్డ్ కప్ సాధించాలని రోహిత్ సేన భావిస్తోంది.. మరోవైపు తమ గడ్డపై జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాపై ప్రతీకారం తీర్చుకుంటూ.. తొలి టీ20 వరల్డ్ కప్ గెలవాలని ప్రొటీస్ జట్టు గట్టి పట్టుదలతో ఉంది. ఫైనల్ మ్యాచ్ సంగతి అలా ఉంటే.. గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా రెండు అద్భుతమైన సిక్సులు కొట్టాడు.
ఆ రెండు సిక్సులు మ్యాచ్‌కే హైలెట్‌గా మారాయి. మ్యాచ్ ముగిసిన తర్వాత అంతా రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్ గురించే మాట్లాడుతున్నారు.. కానీ, పాండ్యా కొట్టిన రెండు సిక్సులతో మ్యాచ్ టీమిండియావైపు మలుపు తిరిగింది. పైగా ఆ సిక్సులు కూడా సాదాసీదా సిక్సులు కాదు.. ఫ్లాట్‌గా రాకెట్ వేగంతో దూసుకెళ్లాయి. రెండు వరుస బంతుల్లో రెండు వరుస సిక్సులతో టీమిండియా ఇన్నింగ్స్‌లో ఒక్కసారిగా ఊపు తెచ్చాడు పాండ్యా. తన పవర్ ఫుల్ హిట్టింగ్‌తో తనను కుంఫూ పాండ్యా అని ఎందుకు పిలుస్తారో చూపించాడు.
ఇంగ్లండ్ స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో పాండ్యా ఈ సిక్సులు బాదాడు. ఆ ఓవర్ రెండో బంతిని వైడ్ లాంగ్ ఆన్ పైనుంచి ఫ్లాట్ సిక్స్ కొట్టాడు. అది బుల్లెట్ వేగంతో దూసుకెళ్లింది. ఆ నెక్స్ బాల్‌ని ఈ సారి లాంగ్ ఆఫ్ దిశగా మరో ఫ్లాట్ సిక్స్ కొట్టాడు. ఈ రెండు సిక్సులు చూసి.. ఇంగ్లండ్ ఆటగాళ్లు షాక్ అయ్యారు. తొలి సిక్స్ 81 మీటర్లు, రెండు సిక్సు 82 మీటర్ల దూరం వెళ్లి పడింది. అయితే.. ఈ రెండు సిక్సర్లలో ఉన్న విశేషం ఏంటంటే.. చాలా ఫ్లాట్‌గా వెళ్లాయి. ఆ షాట్ ఆడినప్పుడు ఇది క్యాచ్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ, బౌండరీ లైన్ వద్ద ఉన్న ఫీల్డర్ చేతికి కొంచెం పై నుంచి సిక్స్ వెళ్లింది. అదే ఓవర్ నాలుగో బంతికి కూడా సేమ్ షాట్ కొట్టిన పాండ్యా.. ఆ సారి అంత పవర్ జనరేట్ చేయలేకపోయాడు. లాంగ్ ఆఫ్‌లో సామ్ కరన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మొత్తంగా 13 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సులతో 23 పరుగులు చేశాడు. మరి పాండ్యా కొట్టిన రెండు సిక్సులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This 2 Sixes from Hardik Pandya can Certainly change the game in Favour of Team India 🇮🇳
Some Fans Trolled Hardik Pandya during IPL 2024, But now Hardik emerged as the best all rounder of the Tournament 💥 #INDvsENG2024 #INDvENG pic.twitter.com/PsSKS6PHSU
— Richard Kettleborough (@RichKettle07) June 27, 2024