SNP
Gautam Gambhir, Suryakumar Yadav, Maheesh Teekshana, IND vs SL: టీమిండియా స్టార్ బ్యాటర్ కొట్టిన ఓ షాట్ చూసి.. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అదిరిపోయే రియాక్షన్ ఇచ్చాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
Gautam Gambhir, Suryakumar Yadav, Maheesh Teekshana, IND vs SL: టీమిండియా స్టార్ బ్యాటర్ కొట్టిన ఓ షాట్ చూసి.. కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అదిరిపోయే రియాక్షన్ ఇచ్చాడు. దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను యంగ్ టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన రెండో టీ20లో ఆల్‌రౌండర్ ప్రదర్శన చేసిన భారత జట్టు.. లంకను వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓడించింది. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ కొట్టిన షాట్‌కు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ షాక్ అయ్యాడు. సాధారణంగా మ్యాచ్ గెలిచేంత వరకు తన భావోద్వేగాలను కంట్రోల్‌లో పెట్టుకునే గంభీర్.. టీమిండియా హెడ్ కోచ్‌గా మాత్రం తన ఎక్స్‌ప్రెషన్స్‌ను బయటపెడుతున్నాడు. డగౌట్‌లో కూర్చోని సీరియస్‌గా మ్యాచ్ చూసే గంభీర్.. ఆదివారం మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కొట్టిన ఓ సెన్సేషనల్ షాట్‌కు రియాక్ట్ అయ్యాడు.
వర్షం కారణంగా టీమిండియా టార్గెట్‌ను 8 ఓవర్లలో 78 పరుగులకు కుదించారు. దీంతో.. తొలి ఓవర్ నుంచి భారత బ్యాటర్లు హిట్టింగ్ చేయాల్సి వచ్చింది. ఇదే క్రమంలోనే నాలుగో ఓవర్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసం సృష్టించాడు. తన తొలి ఓవర్‌లోనే సంజు శాంసన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన భారత్‌కు షాకిచ్చిన శ్రీలంక స్పిన్నర్ మహీష్ తీక్షణను టార్గెట్ చేసి.. అతను వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో తొలి మూడు బంతులకు మూడు ఫోర్లు బాది.. దుమ్మురేపాడు. తీక్షణ స్పిన్‌ను బ్రేక్ చేసేందుకు.. సూర్య తనకు అలవాటైన స్వీప్ షాట్లను ప్రయోగించాడు. మూడు కూడా అలాగే ఆడి మూడు బౌండరీలు సాధించాడు.
తొలి బాల్‌ను బ్యాక్వర్డ్ స్క్వౌర్ వైపు ఫోర్ కొట్టాడు. సూర్య కొట్టిన ఆ షాట్ చూసి.. లంక కెప్టెన్ ఫీల్డర్ అక్కడ పెట్టాడు. రెండో బంతిని తీక్షణ టాస్ బాల్‌గా వేశాడు. దాన్ని కూడా స్వీప్ ఆడిన సూర్య.. ఇంతకు ముందు లంక కెప్టెన్ ఎక్కడి నుంచి అయితే ఫీల్డర్‌ను తీసేశాడో అక్కడ బౌండరీ కొట్టాడు. ఒక విధంగా లంక ఫీల్డింగ్‌తో ఆడుకున్నాడు మిస్టర్ 360. ఇక మూడో బంతిని కూడా సూర్య స్వీప్ ఆడాడు. కానీ, బంతికి టాప్ ఎడ్జ్ తీసుకొని.. డీప్ స్క్వౌర్ లెగ్ వైపు గాల్లోకి లేచింది. కానీ అక్కడ ఫీల్డర్స్ లేకపోవడంతో సేఫ్‌గా ల్యాండ్ అయి.. బౌండరీకి వెళ్లింది. ఈ షాట్ చూసి.. డగౌట్‌లో కూర్చున్న గంభీర్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. తమను ఇబ్బంది పెడుతున్న బౌలర్‌ను ఊతికి ఆరేసిన తీరు.. ఆ మూడో షాట్‌కు ఫిదా అయిపోయిన గంభీర్ ఏం కొట్టాడు అంటూ.. తన ఎక్స్‌ప్రెషన్‌తోనే అభినందించాడు. సూర్య కొట్టిన షాట్‌కు గంభీర్ ఇచ్చిన రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరి ఈ సూర్య షాట్‌తో పాటు గంభీర్ రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Reaction of Coach Gautam Gambhir after Captain Suryakumar Yadav hit 3 consecutive boundaries by sweep. pic.twitter.com/nfr4aGgt38
— Cricket is Love ❤ (@cricketfan__) July 28, 2024