IND vs SL: రోహిత్‌, కోహ్లీతో పాటు టీమిండియాను మడతబెట్టేశాడు! ఎవరీ వాండర్సే?

IND vs SL: రోహిత్‌, కోహ్లీతో పాటు టీమిండియాను మడతబెట్టేశాడు! ఎవరీ వాండర్సే?

Jeffrey Vandersay, IND vs SL: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 241 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేయలేకపోయింది. అందుకు కారణం ఒకే ఒక్క బౌలర్‌. అతనెవరో? అతని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Jeffrey Vandersay, IND vs SL: శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 241 పరుగుల టార్గెట్‌ను ఛేజ్‌ చేయలేకపోయింది. అందుకు కారణం ఒకే ఒక్క బౌలర్‌. అతనెవరో? అతని కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌-శ్రీలంక మధ్య కొలంబో వేదికగా జరిగిన రెండో వన్డేలో ఓ బౌలర్‌ సంచలన ప్రదర్శన చేశాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 6 వికెట్లతో టీమిండియా ఓటమిని శాసించాడు. ప్రపంచ అగ్రశ్రేణి జట్టుగా ఉన్నా.. టీమ్‌లో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ లాంటి హేమాహేమీలు ఉన్నా కూడా.. కేవలం 241 పరుగుల లక్ష్యాన్ని చేరుకోనివ్వకుండా చేశాడు. స్టార్‌ స్పిన్నర్‌ వనిందు హసరంగా గాయంతో జట్టుకు దూరం కావడంతో అతని స్థానంలో జట్టులోకి వచ్చిన జెఫ్రీ వాండర్సే.. అద్భుతం చేశాడు. తన జట్టుకు ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు.

రోహిత్‌ శర్మ, శుబ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, శివమ్‌ దూబే, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌.. భారత బ్యాటింగ్‌ ఆర్డర్‌ మొత్తాన్ని పెవిలియన్‌లో కూర్చోబెట్టాడు. 10 ఓవర్లలో కేవలం 33 పరుగులు మాత్రమే ఇచ్చి.. 6 వికెట్లు పడగొట్టాడు. అతని బౌలింగ్ ఎదుర్కొనేందుకు భారత బ్యాటర్లు వణికిపోయారు. 1990 ఫిబ్రవరి 5న జన్మించిన వాండర్సే.. 2015లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దాదాపు 9 ఏళ్ల క్రితమే ఇంటర్నేషనల్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టినా.. పెద్ద మ్యాచ్‌లు ఆడలేదు. ఇప్పటి వరకు కేవలం 22 వన్డేలు మాత్రమే ఆడాడు. అలాగే 14 టీ20లు ఆడాడు. 2022లో ఒకే ఒక టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. టెస్టుల్లో 2, వన్డేల్లో 33, టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 240 పరుగులు చేసింది. ఓపెనర్‌ అవిష్క ఫెర్నాండో 40, కుసల్‌ మెండిస్‌ 30, దునిత్‌ వెల్లలాగే 39, కమిందు మెండిస్‌ 40 పరుగులతో రాణించారు. చిన్న చిన్న పార్ట్నర్‌షిప్‌లతో టీమిండియా ముందు పోరాటే టార్గెట్‌ను ఉంచింది లంక. భారత బౌలర్లలో వాషింగ్టన్‌ సుందర్‌ 3, కుల్దీప్‌ యాదవ్‌ 2 వికెట్లతో రాణించారు. సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌ చెరో వికెట్‌ తీసుకున్నారు. ఇక 241 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియా 42.2 ఓవర్లలో 208 పరుగులకే ఆలౌట్‌ అయి.. 32 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 44 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సులతో 64 పరుగులు చేసి రాణించాడు. శుబ్‌మన్‌ గిల్‌ 35, అక్షర్‌ పటేల్‌ 44 రన్స్‌తో పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. లంక బౌలర్లలో జెఫ్రీ వాండర్సే ఏకంగా 6 వికెట్లతో ఇండియా ఓటమిని శాసించాడు. లంక కెప్టెన్‌ అసలంకా 3 వికెట్లతో రాణించాడు. మరి ఈ మ్యాచ్‌లో వాండర్సే బౌలింగ్‌తో పాటు, అతను 6 వికెట్లు పడగొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments